గద్వాల జిల్లాలో డ్రగ్స్ రక్షిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్క పౌరుడు బాధ్యతగా కృషి చేయాలి .

కలెక్టర్,& జడ్పీ చైర్మన్.

Jun 26, 2024 - 16:48
Jun 26, 2024 - 19:10
 0  16

జోగులాంబ గద్వాల 26 జూన్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:-  గద్వాల. జిల్లాను డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని జడ్పీ చైర్ పర్సన్ సరిత పిలుపునిచ్చారు. బుధవారం మాదకద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గద్వాల కృష్ణవేణి చౌరస్తాలో మిషన్ పరివర్తన పేరుతో నిర్వహించిన అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ బి.యం. సంతోష్, ఎస్పీ టి .శ్రీనివాసరావుతో కలిసి జడ్పీ చైర్పర్సన్ సరిత ప్రారంభించారు. పాత బస్టాండ్ వరకు నిర్వహించిన ర్యాలీ అనంతరం ఆమె మాట్లాడుతూ, డ్రగ్స్ తీసుకోవడం వలన కలిగే నష్టాలపై విద్యార్థి దశ నుంచే ప్రతి ఒక్కరూ అవగాహనతో ముందుకెళ్లాలన్నారు.  డ్రగ్స్ నిర్మూలనకు యువత తమ వంతు కృషి చేయాలని సూచించారు. విద్యార్థులు చదువు పైనే దృష్టి పెట్టి తమ భవిష్యత్తును గొప్పగా తీర్చిదిద్దుకోవాలని, మాదకద్రవ్యాల బారిన పడితే జీవితాంతం బాధపడాల్సి వస్తుందన్నారు. మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు పోలీసులే కాకుండా ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా స్వీకరించి అరికట్టేందుకు కృషి చేయాలన్నారు. జీవితంలో స్థిర పడాల్సిన సమయంలో దురలవాట్లకు అలవాటు పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని, రాబోయే భవిష్యత్తును బంగారు బాటలు వేసుకోవాలన్నారు. 


      జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ మాట్లాడుతూ 1989 నుంచి ఈ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, దీని ప్రాముఖ్యతను ప్రతి ఒక్కరూ గుర్తించాలన్నారు. డ్రగ్స్ అమ్మే వారి గురించి పౌరులు తమ బాధ్యతగా పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.  డ్రగ్స్ బారిన పడిన యువతను కుటుంబ సభ్యులు అవసరమైన చికిత్స చేయించాలని కోరారు. జిల్లా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో బాధితులకు మెరుగైన వైద్య చికిత్సలు అందించడం జరుగుతుందన్నారు.  17-18 ఏళ్లలోపు యువత డ్రగ్స్ బారిన పడేందుకు ఎక్కువగా అవకాశం ఉందని, ఈ సమయంలో వీరికి డ్రగ్స్ వలన కలిగే నష్టాల గురించి వివరించాల్సిన అవసరం ఉందన్నారు. డ్రగ్స్ బారిన పడకుండా విద్యార్థులు చక్కగా చదువుకోవాలని శారీరకంగా, మానసికంగా బలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. యువత మత్తు పానీయాలు, సిగరెట్లు, గుట్కాలు, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి తమ విలువైన ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దన్నారు.  

      జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు  మాట్లాడుతూ, పౌరులు మాదకద్రవ్యాలకు బానిసలు కాకుండా  మాదక దవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పటిష్టమైన చర్యలు చేపట్టిందని,  జిల్లాలో పోలీసు శాఖ ఆధ్వర్యంలో కూడా మాదకద్రవ్యాల నిర్మూలన కొరకు కట్టదిట్టమైన చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు.  ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో యాంటీ నార్కోటెక్ బ్యూరో ఏర్పాటు చేసి ప్రత్యేక సిబ్బందిని నియమించినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.విద్యార్థులు అందరు ఈ దశ నుండే మాదక ద్రవ్యాల వల్ల జరిగే దుష్పరిణామాల గురించి అవగాహాన పెంచుకొని కుటుంబ సభ్యులకు , తమ గ్రామలలో ప్రజలను చైతన్యం చెయ్యాలని అన్నారు.  రాష్ట్రంలో కి మాదక ద్రవ్యాల ను రాకుండ చూసే బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ రాష్ట్రం లోకి రాకుండ చూడాలని,  డ్రగ్స్ నిర్మూలన ప్రతి ఒక్కరు తమ బాధ్యతగా భావించి వీటి బారిన పడకుండా యువత సురక్షితంగా ఉండాలన్నారు.

    ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  బి.యం. సంతోష్ డ్రగ్స్ నివారణకు సంబంధించిన ప్రతిజ్ఞను విద్యార్థులు, అధికారులతో చేయించారు.  డ్రగ్స్ నిర్మూలనపై విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన పోటీలులో విజేతలుగా నిలిచిన వారికి ముఖ్య అతిథులు ప్రశంసా పత్రాలు అందజేశారు. 'ఐయాం యాంటీ డ్రగ్ షోల్డర్' అనే పేరుతో ఏర్పాటు చేసిన సెల్ఫీ పాయింట్ వద్ద జడ్పీ చైర్ పర్సన్ సరిత, కలెక్టర్ బి. ఎం. సంతోష్, ఎస్పీ టి .శ్రీనివాసరావు, తదితరులు సెల్ఫీలు దిగారు. 


      ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిని  సుధారాణి, అదనపు ఎస్పీ గుణశేఖర్, డి . ఎస్పీ సత్యనారాయణ వివిధ శాఖల అధికారులు, విద్యార్థులు, యువత, స్థానిక ప్రజా ప్రతినిధులు  తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333