పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించాలి:జిల్లా ఎస్పీ
జోగులాంబ గద్వాల 11 మార్చి 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- గద్వాల పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించాలి అని జిల్లా ఎస్పీ రితిరాజ్ అన్నారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయం లో ప్రజావాణి సందర్భంగా వివిధ సమస్యల పై వచ్చిన ప్రజా ఫిర్యాదులను జిల్లా ఎస్పీ రితిరాజ్ స్వీకరించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ భార్య భర్తల మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలకు ఒకరిపై ఒకరు పిర్యాదు చేసుకునే దాకా వెళుతున్నారని అలాంటి ఫిర్యాదులను సునితమైనవి గా భావించి వారిని ఫ్యామిలీ కౌన్సిలింగ్ కు పంపి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుందని అన్నారు.
ప్రజావాణి లో భాగంగా ప్రజల నుండి వచ్చిన ఫిర్యాదులను ఎస్పీ స్వీకరించి వారితో మాట్లాడుతూ.... అక్కడి స్థానిక పోలీస్ స్టేషన్ లలో పోలీస్ ల స్పందన గురించి ఆడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదుల పై ఆయా పోలీసు స్టేషన్ల అధికారులతో మాట్లాడుతూ, పోలీసు పరిధిలోని ప్రతి అంశాన్ని పరిష్కరించడం, బాధితులకు న్యాయం చేయడంలో వేగంగా చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. మరియు పిర్యాదు దారులు సివిల్ వివాదాలను కోర్టులోనే పరిష్కరించుకో వలసిందిగా వారికి సూచించారు.ఈ రోజు వచ్చిన ఫిర్యాదులలో
భర్త వేదింపులకు సంబందించి -01 పిర్యాదు.అమ్మాయి మిస్సింగ్ కు సంబందించి -0 1పిర్యాదు.ఎస్సీ, ఎస్టీ కేసుకు సంబంధించి -01 పిర్యాదు.ఇతర అంశాలకు సంబంధించి -02 పిర్యాదులు.