**మల్టీ సర్వీసెస్ డే కేర్ సెంటర్ ను ప్రారంభించిన""మంత్రి తుమ్మల*

మల్టి సర్వీసెస్ డే కేర్ సెంటర్ ప్రారంభించిన మంత్రి తుమ్మల...
తెలంగాణ వార్త ప్రతినిధి రావెళ్ల"**ఖమ్మం జిల్లా రెడ్ క్రాస్ సొసైటి ఆధ్వర్యంలో నూతనంగా సీనియర్ సిటిజన్స్ డే కేర్ సెంటర్ ను గురువారం రోజున వ్యవసాయ చేనేత శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావ్ ప్రారంభించారు.
ఖమ్మం పట్టణంలోని రెడ్ క్రాస్ సొసైటి కార్యాలయంలో సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర ను వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు ప్రారంభ కార్యక్రమంలో ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాకు ఒక డేకేర్ సెంటర్ చొప్పున ఏర్పాటుకు సహకరిస్తుందని సీనియర్ సిటిజన్ లకు ఈ సంస్థలో సభ్యత్వం ద్వారా ఆరోగ్య పరమైన ప్రయోజనాలు పాందవచ్చని తెలిపారు. ప్రతి రోజు డాక్టర్ష ద్వారా ఆరోగ్య విషయాలపై చెకప్ చేసుకునే అవకాశం వుంటుందని ఉచితంగా మెడిసిన్ కూడా పొందవచ్చని పగలు పూట అల్పాహారం తో పాటు లైబ్రరీ క్యారమ్స్ చెస్ వంటి సదుపాయాల ద్వారా ప్రయోజనం పొందాలని జిల్లా ప్రజలు ఈ సౌకర్యాన్ని వినియోగించు కోవాలన్నారు. ఖమ్మం జిల్లా రెడ్ క్రాస్ సొసైటి, జిల్లా సినియర్ సిటిజన్ డేకేర్ మల్టి సర్వీసెస్ సెంటర్ ఛైర్మన్ డాక్టర్ వెలిగేటి చంద్రమోహన్ వయో వృద్ధుల కొరకు ఓల్డ్ ఏజ్ హోమ్ నిర్మాణం కోసం 1 కోటి రూపాయల ప్రభుత్వం సహాయం కోరగా మంత్రి స్పందిస్తూ నిధులు విడుదల చేస్తానన్నారు. ప్రస్తుతం డేకేర్ సెంటర్ కు నిధులు కోరగా స్పందిస్తూ జిల్లా సంక్షేమ అధికారి రామ్ గోపాల్ రెడ్డితో ప్రపోజల్ తయారు చేసి ఇవ్వవల్సిందిగా తెలిపారు. డి హెచ్. యం. ఒ. కళావతి మాట్లాడుతూ సీనియర్ సిటిజన్స్ కోసం జేరియాట్రిక్ వార్డును ఏర్పాటు చేయడానికి సుముఖత వ్యక్తం చేసారు, డే కేర్ సెంటర్ లో సీనియర్ సిటిజన్స్ కు ప్రతివారం మెడిసిన్స్ డాక్టర్ సౌకర్యం కల్పిస్తా అన్నారు. జిల్లా జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ఖమ్మం పట్టణంలో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసిన రెడ్ క్రాస్ సొసైటీ కు అభినందనలు తెలుపుతూ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ బ్యాంకు ఏర్పాటుకై సత్తుపల్లిలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయిస్తానని తెలుపారు, డే కేర్ సెంటర్లోని సదుపాయాల్ని సీనియర్ సిటిజన్లు వుపయోగించు కోవాలని ఈ సందర్భంగా కోరారు. డే కేర్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా రెడ్ క్రాస్ సొసైటి ఛైర్మన్ డాక్టర్ వెలిగేటి చంద్ర మోహన్, ఖమ్మం మేయర్ పునుకొల్లు నీరజ, కార్యవర్గ సభ్యులు బి. సూర్య ప్రకాశరావ్ మూలగుండ్ల శ్రీ హరి సాధినేని జనార్ధన్ రావ్ డాక్టర్ విజయలక్ష్మి ఎ. గోవర్ధన్ రావ్ జి. నాగేశ్వర్ రావ్ జల్ల వెంకటేశ్వర్లు జాన్ పుల్లయ్య జి. వెంకటేశ్వర్లు బానాల చారీ కే దాసు నరసయ్య మండవ వెంకటేశ్వర్లు సి.హెచ్ మూర్తి తదితరులు పాల్గొన్నారు.