పెద్దలు పనికి పిల్లలు బడికి

జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : అలంపూర్ లో బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం ర్యాలీ ప్రపంచ బాల కార్మిక వ్యతిరేక దినోత్సవం సందర్భంగా అలంపూర్ పట్టణంలో రాజ్కుమార్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ చంద్రశేఖర రావు ప్రారంభించగా పురవీధుల గుండా నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బాల కార్మికులను బడిలో చేర్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. పెద్దలు పనికి పిల్లలు బడికి పోయేలా ప్రతి తల్లిదండ్రి ఆలోచించి పిల్లలను బడికి పంపాలన్నారు. నిర్వాహకురాలు రత్నకుమారి మాట్లాడుతూ కరోనాలో పాఠశాలలు మూతపడి అప్పట్లో ఎంతోమంది చదువుకు దూరమయ్యారని దాని నుండి బాల కార్మిక వ్యవస్థ మొదలైన ప్రస్తుతం ప్రభుత్వం బాల కార్మిక నిర్మూలనకు అనేక విధాల కృషి చేస్తున్నదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్యాలయ సిబ్బంది, కొట్టు శిక్షణ పొందుతున్న మహిళలు తదితరులు పాల్గొన్నారు.