భరోసా, షి టీం, సఖి కేంద్రాలను ఆకస్మికంగా సందర్శించి సిబ్బంది విధులను, అందిస్తున్న సేవలను పరిశీలించిన
జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్
జోగులాంబ గద్వాల 12 జూన్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లా కేంద్రం లోని రెవెన్యూ కాలనీలో ఉన్న భరోసా, షి టీం మరియు సఖి కేంద్రాలను జిల్లా ఎస్పీ శ్రీ టి శ్రీనివాస రావు ఐపీఎస్ ఆకస్మికంగా సందర్శించి కేంద్రాల నిర్వహణ , సిబ్బంది విధులను పరిశీలించారు. అందులో బాగంగా భరోసా కేంద్రాన్ని సందర్శించి కాన్ఫరెన్స్ హాల్, డైనింగ్ హాల్, మెడికల్ రూమ్, సపోర్ట్ పర్సన్, స్టేట్మెంట్ రికార్డు, కౌన్సిలింగ్ రూమ్ లను పరిశీలించి భరోసా సిబ్బంది యొక్క పనితీరు మరియు రోజు వారి కేసుల గురించి తెలుసుకోవడం జరిగింది. లైంగిక వేధింపులకు గురై భరోసా కేంద్రానికి వచ్చే బాధితుల కు ఒకే గొడుగు కింద అన్ని సేవలు నిర్ణిత సమయంలో అందించాలని, వారికి తగిన సహాయం కూడా సకాలంలో అందేలా చూడాలని తెలియజేస్తూ సిబ్బందికి తగు సూచనలు ఇవ్వడం జరిగింది. షి టీం కేంద్రాన్ని సందర్శించి రిసెప్షన్, కౌన్సిలింగ్ మరియు రైటర్ రూమ్ లను, రికార్డ్స్ ను పరిశీలించారు. నేటి నుండి విద్యా సంస్థలు ప్రారంభము అవుతునందున రోజు ఒక చోట అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, గుర్తించిన హాట్ స్పాట్స్ లలో పకడ్బంది గా నిఘా ఉంచాలని ఆదేశించారు. భరోసా, షి టీం కేంద్రాల నిర్వహణ పై ఎస్పీ సిబ్బందిని అభినందించారు. అనంతరం సఖి కేంద్రాన్ని సందర్శించి సెంటర్ ఫంక్షనింగ్ ను, సిబ్బంది విధులను పరిశీలించారు. అక్కడ బాధిత మహిళలకు అందిస్తున వసతి, భోజనం ఏర్పాట్లు, అందుతున్న కౌన్సిలింగ్, వస్తున్న కేసులు మొదలగు అంశాల గురించి ఇంచార్జి అధికారి శోభా ఎస్పీ కి వివరించారు. ఎస్పీ వెంట గద్వాల CI టంగుటూరి శ్రీను, గద్వాల రూరల్ ఎస్సై శ్రీకాంత్ ,భరోసా, షి టీం WSI స్వాతి, కోఆర్డినేటర్ శివాని, సఖి కేంద్రం ఇంచార్జి శోభా, భరోసా, సఖి , షి టీం సిబ్బంది పాల్గొన్నారు.