పెద్దపల్లి జిల్లాలో డి జే ఎఫ్ 5వ రాష్ట్ర మహాసభకు హాజరైన మంత్రి శ్రీధర్ బాబు

Aug 10, 2025 - 21:41
Aug 10, 2025 - 21:44
 0  35

అడ్డగూడూరు 10 ఆగస్టు 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–

డెమొక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ 5వ రాష్ట్ర మహాసభను పెద్దపల్లి జిల్లా రాఘవపురంలో ఘనంగా నిర్వహించారు. చిన్న పత్రిక పెద్ద పత్రికలంటూ తేడాలు చూపిస్తున్న నాయకులు, అధికారులు ఇకనైనా తమ వైఖరి మార్చుకోవాలని డి జే ఎఫ్ జాతీయ అధ్యక్షులు మాసని కృష్ణారెడ్డి అన్నారు.ఇట్టి సభకు ముఖ్య అతిదులుగా విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర ఐ టీ శాఖ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు , శాసనసభ్యులు విజయ రామారావు మాట్లాడుతూ..సమాజాన్ని చైతన్యం చేస్తూ ముందుకెళ్తున్న పత్రిక విలేఖరులను చిన్న పత్రిక మరియు పెద్ద పత్రికలు అంటూ విడదీస్తూ అక్రిడేషన్ ప్రామాణికం అని చెబుతు అనేకమంది పత్రికా విలేకరులను సమాజానికి దూరం చేస్తున్నారనీ, ఎలాంటి ఆర్థిక వనరులు లేకున్నా సమాజానికి ఏదో చేయాలన్న తపనతో ఈ రంగంలో కొనసాగుతున్న విలేకరులను ఇంకా చిన్న చూపు చూస్తూ ఉండడంవల్ల అనేకమంది విలేకర్లు ఇబ్బంది పడుతున్నారన్నారు. కాబట్టి పత్రిక గుర్తింపు కార్డు కలిగిన ప్రతి ఒక్కరిని విలేఖరిగా గుర్తించి ప్రభుత్వ పథకాలలో తగిన ప్రాధాన్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో డి జె ఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి బండారమారుతీ, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎండి రహమాన్ అలీ, సూర్యాపేట జిల్లా నాయకులు షేక్ చాంద్ పాషా, తిరుమలగిరి మండల అధ్యక్షుడు నీర్మాల బాలకృష్ణ, గౌరవ అధ్యక్షులు బాకీ శ్రీనివాస్, కోశాధికారి పోరెళ్ల వెంకన్న, కార్యదర్శి ఊడుగు సుధాకర్, సభ్యులు చాపల నవీన్ కుమార్, అడ్డగూడూరు మండల అధ్యక్షులు కడియం రవివర్మ,చింత సుధాకర్,పరాశరములు తదితరులు పాల్గొన్నారు.