జై బాపు జై భీమ్ జై సంవిధాన్
జోగులాంబ గద్వాల 26 మార్చి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లా స్థాయి సదస్సు లో *ముఖ్య అతిథిగా పాల్గొన్న అలంపూర్ మాజీ ఎమ్మెల్యే ఏఐసీసీ కార్యదర్శి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాష్ట్ర సమన్వయకర్త డాక్టర్.ఎస్.ఏ.సంపత్ కుమార్ .* మరియు తెలంగాణ సాంస్కృతిక శాఖ ఛైర్మెన్ వెన్నెల (గద్దర్ ) మరియు రాష్ట్ర జోగులాంబ గద్వాల జిల్లా సమన్వయకర్త క్రిస్టియన్ మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంపత్ కుమార్ మాట్లాడుతూ గాంధీజీ మరియు డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ కలలుగన్న గ్రామ స్వరాజ్యం రాజ్యాంగ పరిరక్షణ కొరకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని అన్నారు.
మహాత్మ గాంధి చూపిన మార్గంలో నడుస్తూ అంబేద్కర్ రాజ్యాంగాన్ని కాపాడుతూ దేశ ప్రజలను మభ్య పెడుతూ మనువాద సిద్ధాంతాన్ని ప్రజల పైన రుద్దుతున్న భారతీయ జనతా పార్టీని ఎండగడుతూ రాజ్యాంగ పరిరక్షణ పైన అవగాహన కల్పించే దిశగా గ్రామ గ్రామాన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
బీజేపీ ప్రభుత్వం హిందీని జాతీయ భాష చేయాలని కుట్ర పన్నుతున్నారు తెలుగు ప్రాంత ప్రజలకు అన్యాయం చేసే ఈ చర్యను అడుగడుగునా అడ్డుకోవాలని అన్నారు.
రాజ్యాంగం యిచ్చిన హక్కుల ద్వారానే మనం ప్రశ్నించ గలుగుతున్నాం మన హక్కులను సాధించ గలుగుతున్నం కనుక రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడు పైన ఉంది అన్నారు.
ఈ కార్యక్రమంలో వీరితో పాటు జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ జిల్లా ఇన్చార్జి సరితతిరుపతయ్య, జిల్లా గ్రంథాలయ చైర్మన్ నీలి శ్రీనివాసులు, మార్కెట్ కమిటీ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ మరియు గద్వాల జిల్లా లోని అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు కార్యకర్తలు అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.