**పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన""జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు*

తెలంగాణ వార్త ప్రతినిధి : తేది:24/12/2024.. దురాజుపల్లి, చివ్వెంల..
పెద్దగట్టు జాతర ప్రాంగణాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్.
త్వరలో జరగనున్న దురాజుపల్లి పెద్దగట్టు జాతర యొక్క పరిసరాలను జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్ గారు ఈరోజు పరిశీలించారు.
జాతర యొక్క పరిసరాలను, దేవాలయ ప్రదేశాన్ని, రోడ్డు మార్గాలను, భక్తులు వేచి ఉండే స్థలాలు వాహనాల పార్కింగ్ ప్రవేశాల స్థితిగతులను ఎస్పీ పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలు ఇచ్చారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించడం జరిగినదని ప్రణాళిక ప్రకారం ముందుకెళ్లి జాతరను ప్రశాంతంగా నిర్వహిస్తామని, పెద్దగట్టు జాతర యొక్క పోలీసు బందోబస్తు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించాలని స్థానిక పోలీస్ అధికారులకు, స్పెషల్ బ్రాంచ్ పోలీసులకు తెలిపినారు, జాతీయ రహదారి వెంట వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు. ఇతర శాఖల అధికారులతో కలిసి సమన్వయంగా పని చేయాలని తెలిపారు. జాతర ప్రాంగణంలో కావాల్సిన రక్షణ ఏర్పాట్లకు సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవాలని ఇతర శాఖలతో సమన్వయంతో ముందుకెళ్లాలని సిబ్బందికి సూచించారు. బందోబస్తు ప్రణాళిక పై స్పెషల్ బ్రాంచ్ దృష్టి పెట్టి పని చేయాలని అన్నారు.
అనంతరం దైవ దర్శనం చేసుకుని పూజలు నిర్వహించారు.
ఎస్పీ వెంట DSP రవి, సూర్యాపేట రూరల్ సిఐ రాజశేఖర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ నాగభూషణం, స్థానిక ఎస్సై మహేశ్వర్, సిబ్బంది ఉన్నారు.