పెండింగ్ జితాలకోసం కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా
ప్రెస్ నోట్ తేదీ 23,9,2024. Gdl
మిషన్ భగీరథ కార్మికుల 7 నెలల పెండింగ్ జీతాలు వెంటనే చెల్లించాలి -- AITUC జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు
కాంట్రాక్టర్లు కార్మికులకు గుర్తింపుకార్డులు, ఉద్యోగ భద్రత కల్పించకుండా వెట్టి చాకిరి చేయించుకోవడం దుర్మార్గం.
ఈరోజు జోగులాంబ గద్వాల జిల్లాలో మిషన్ భగీరథ ihp కంపెనీ క్రింద పనిచేస్తున్న కార్మికులు గత 7నెలలగా నుండి పెండింగ్ లో ఉన్న తమ జీతాలను వెంటనే చెల్లించాలని ,ఉద్యోగ భద్రత, గుర్తింపు కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ యెక్క ధర్నాకు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు హాజరై మాట్లాడారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ కార్మికుల సమస్యలు కోకొల్లలుగా ఉన్న కాంట్రాక్టర్లు అధికారులు పట్టించుకోవడం లేదని, గత పాలకులు వీరిని గుమస్తాలుగా చూసారని నేటి ప్రభుత్వం అయిన జీతాలు పెంచి సక్రమంగా ఉద్యోగులకు భద్రత, గుర్తింపు, ఈ ఎస్ ఐ సౌకర్యాలు, బోనస్ కల్పించి న్యాయం చేయాలని కోరారు.7నెలల నుండి జీతాలు ఇవ్వకపోతే కార్మికుల కుటుంబాలు ఎట్లా గడుస్తాయన్నారు. ఎవరైనా జీతాలు హక్కులు అడిగితే నిర్ధాక్షిణ్యంగా తొలగిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా అధికారులు పట్టించుకోవడం లేదన్నారు , కాంట్రాక్టర్ బెదిరింపులకు గురిచేస్తున్నారాన్నారు . బోనస్ లు లేని కార్మికులు మిషన్ భగీరథ కార్మికులు మాత్రమే అన్నారు. కార్మికులు మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ వెంటనే ప్రభుత్వం తో మాట్లాడి 7నెలల పెండింగ్ జీతాలు వేయించాలని కోరారు.కార్మికులు మా సమస్యలు పరిష్కారం చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలిపారు . ధర్నా అనంతరం కలెక్టర్ లేకపోవడంతో ఆఫీస్ AO బద్రప్ప గారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు మిషన్ భగీరథ కార్మికులు కిరణ్, బెమేష్ నరసింహులు, వెంకట్, పవన్, కళ్యాణ్ అనుమంత్, వేరేష్, రాము తదితరులతో పాటు 70మంది కార్మికులు పాల్గొన్నారు.
ఇట్లు
ఉద్యమాభివందనలతో
మిషన్ భగీరథ కార్మికులు
జోగులాంబ గద్వాల జిల్లా