ఉచిత ఇసుక విధానం అమలుపై హర్షం""ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు
ఏపీ. తెలంగాణ వార్త ఇంచార్జ్: ఉచిత ఇసుక విధానం అమలుపై హర్షం వ్యక్తం చేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి భవన నిర్మాణ కార్మికులతో కలిసి పాలాభిషేకం చేసిన ఎమ్మెల్యే శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు.*_
_రాష్ట్రవ్యాప్తంగా ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ జగ్గయ్యపేట పట్టణంలో భవన నిర్మాణ కార్మికుల అడ్డా వద్ద భవన నిర్మాణ కార్మికులతో కలిసి శాసనసభ్యులు శ్రీ శ్రీరాం రాజగోపాల్ తాతయ్య గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చిత్రపటానికి పాలాభిషేకం చేసి స్వీట్లు పంచడం జరిగింది._
_*ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం తాతయ్య గారు మాట్లాడుతూ.*_
_*గత వైసిపి ప్రభుత్వంలో ఇసుక కొరత ఏర్పరిచి భవన నిర్మాణ కార్మికులకు పనులు లేకుండా చేసిందని అన్నారు. ఇసుక కొరతతో భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులకు ఏర్పాటుచేసిన సంక్షేమ బోర్డులు కూడా మూసివేసి అనేక సంక్షేమ పథకాలను భవన నిర్మాణ కార్మికులకు అందకుండా చేసిందన్నారు. ఎన్డీఏ కూటమి అధికారం చేపట్టగానే చంద్రబాబు నాయుడు గారు ఉచిత ఇసుక పంపిణీ మొదలుపెట్టగానే భవన నిర్మాణ కార్మికులలో ఆనందోత్సాహాలు మొదలయ్యాయని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం స్టాక్ పాయింట్ లు పెట్టి ప్రజలందరికీ ఇసుకను అందుబాటులో ఉంచుతుందన్నారు. ప్రభుత్వం కొలువుదీరి నెల రోజుల్లోనే మెగా డీఎస్సీ, వృద్ధాప్య పెన్షన్ల పెంపు, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు,వృత్తి నైపుణ్య స్కీం ఏర్పాటు, అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం మరియు ఉచిత ఇసుక స్కీమును ప్రవేశపెట్టడం చంద్రబాబు ప్రభుత్వానికే ఈ ఘనత దక్కిందని హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని వంద రోజుల్లోనే నెరవేరుస్తుందని అన్నారు.*_
_ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు సంగెపు బుజ్జిబాబు, గొట్టే నాగరాజు, పేరం సైదేశ్వర రావు, గింజుపల్లి వెంకట్రావు మరియు బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు నేలకంఠం ప్రసాద్, ఉపాధ్యక్షులు కర్ల జోజి, బత్తుల బుజ్జి, యూనియన్ సభ్యులు సాకి వెంకటేశ్వర్లు, నేలకంఠం నరసింహారావు, బత్తుల వెంకటేశ్వర్లు, బత్తుల శ్రీను తదితరులు పాల్గొన్నారు._