పురాతన బావిని పరిరక్షించండి
జోగులాంబ గద్వాల 29 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : ధరూర్. మండలం పెద్ద చింతరేవుల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయ సమీపంలో గల పురాతన రాతి కట్టడం బావిని పరిరక్షించాలని పలువురు భక్తులు కోరుతున్నారు. గతంలో ఇక్కడ తపస్సు చేసి స్వామివారికి పూజలు నిర్వహించిన శ్రీ శేషదాసులు నిత్యం ఈ బావిలోనే స్నానం చేసి ఆంజనేయ స్వామి అభిషేకాలు నిర్వహించేవారు అని అట్టి పవిత్రమైన బావిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులో తీసుకురావాలని పలువురు భక్తులు కోరుతున్నారు.