మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బందిని మొదటి  ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు ప్రక్రియ పూర్తి కలెక్టర్

Jan 29, 2026 - 19:33
 0  26
మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బందిని మొదటి  ర్యాండమైజేషన్ ద్వారా కేటాయింపు ప్రక్రియ పూర్తి కలెక్టర్

 జోగులాంబ గద్వాల 29 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  గద్వాల  రాండమైజేషన్ ద్వారా కేటాయింపు ప్రక్రియ పూర్తి 
 -జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. గురువారం ఐడీఓసీ వీడియో కాన్ఫరెన్స్‌లో మున్సిపాలిటీ ఎన్నికల పోలింగ్ సిబ్బందికి మొదటి ర్యాండమైజేషన్ నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ..జిల్లాలోని గద్వాల్, అలంపూర్,అయిజ,వడ్డేపల్లి మునిసిపాలిటీల్లో మొత్తం 77 వార్డులకు నిర్వహించనున్న ఎన్నికల కోసం 189 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.వీటిలో విధులు నిర్వర్తించడానికి  పీఓలు 189, ఏపీఓలు 189,ఓపీఓలు 567 మొత్తం 945 సిబ్బందిని మొదటి ర్యాండమైజేషన్ ద్వారా ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. ఒక్కో మున్సిపాలిటీకి ఎన్నికల కోసం అవసరమైన పోలింగ్ అధికారులను ర్యాండమైజేషన్ విధానంలో కేటాయించినట్లు తెలిపారు.పోలింగ్ కేంద్రాలకు పారదర్శకంగా ఎన్ఐసి సాఫ్ట్ వెర్ వినియోగిస్తూ ఆన్లైన్ లో ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తీ చేయడం జరిగిందని తెలిపారు. జిల్లాలో ఎన్నికలను పరదర్శకంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.


ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ నర్సింగ రావు,ఎన్నికల సిబ్బంది రమేష్,సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333