పాము కాటుకు గురై మహిళా మృతి

తిరుమలగిరి 31 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్ :
పొలంలో వరి నారు తీస్తుండగా పాము కాటుకు గురై కన్నెబోయిన పుష్పలత (43) అనే మహిళ మృతి చెందిన సంఘటన సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మునిసిపాలిటీ పరిధిలోని అనంతరం గ్రామంలో చోటుచేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో కన్నె కంటి పరమేష్ కౌలుకు తీసుకున్న వ్యవసాయ భూమిలో పుష్పలత వరి నారు తీస్తుంది ఈ క్రమంలో మోకాలుకు పాము కాటుకు గురి కావడంతో అత్యవసరంగా 108 అంబులెన్స్ లో సూర్యాపేట జిల్లా ఆసుపత్రి కి తరలించారు ఆమె అప్పటికే మృతి చెందినట్లు సూర్యాపేట వైద్యులు నిర్ధారించారు దీంతో అనంతరం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి