పరిసరాల పరిశుభ్రత పై ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమలు.
జోగులాంబ గద్వాల 24 జనవరి 2026 తెలంగాణ వార్త ప్రతినిధి : ఎర్రవల్లి మండలం కొండేరు గ్రామంలో జిల్లా కలెక్టర్ బి.ఎం సంతోష్ కుమార్ ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆరిఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై మరియు ఓటు అవగాహన కార్యక్రమం పై తెలంగాణ సాంస్కృతి సారధి ప్రభుత్వ కళాకారుల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రాహుల్,కేశవులు.హజరత్ స్వామి తమ ఆట పాట మాటలతో. ప్రజలకు ఓటు పై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.