బ్రహ్మోత్సవాలకు జిల్లా కలెక్టర్ కు ఆహ్వానం
జోగులాంబ గద్వాల 24 జనవరి 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల పట్టణంలోని కోటలో గల శ్రీ భూలక్ష్మి చెన్నకేశవ స్వామి బ్రహ్మోత్సవాలకు సంబంధించిన ఆహ్వాన పత్రికను జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి ఎం సంతోష్ కి దేవాలయ విచారణ కర్త దీన్నే ప్రభాకర్ రావు శనివారం అందజేసి బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించారు. మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి మఠం ఆధ్వర్యంలో జరిగే బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతాయని కలెక్టర్కు వివరించారు. ఈ సందర్భంగా బ్రహ్మోత్సవాలలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఆలయ మేనేజర్ శ్రీపాద జోషి, ఆలయ అర్చకులు సుజయేంద్ర తదితరులు ఉన్నారు...