పండగ రోజు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పరామర్శ

Aug 29, 2026 - 02:31
Aug 29, 2026 - 02:33
 0  3
పండగ రోజు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల పరామర్శ

శ్రీ రామకృష్ణ సేవా ట్రస్ట్ చైర్మన్ బిఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగ రమేష్ 

ములుగు జిల్లా, ఆగస్టు 29:- ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు కాలనీ కి సంబంధించిన బి ఆర్ఎస్ పార్టీ కార్యకర్త చిట్యాల శ్రీనివాస్ ఇటీవల కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతూ ఈ మధ్యకాలంలో ఆపరేషన్ చేయించుకుని ఇంటికి రాగా విషయం తెలుసుకున్న బి ఆర్ ఎస్ పార్టీ ములుగు జిల్లా నాయకులు బాడిశ నాగ రమేష్  వారి ఇంటికి వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని పరామర్శించి వారికి తన వంతు ఆర్థిక సహాయం చేయడం జరిగింది  అలాగే అదే గ్రామానికి చెందిన ఊరుగొండ మురళి కాలి గాయంతో చాలా నెలలుగా బాధపడుతున్నాడు అని తెలుసుకున్న నాగ రమేష్ వారి ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి వారిని పరామర్శించి మీరు అధైర్యపడవద్దని వారికి మనోధైర్యం అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో వారి వెంట వివిధ గ్రామ మాజీ అధ్యక్షులు సోయం ఈశ్వర్ కొమరం పుల్లారావు పండ శ్రీను మునిగిల సాంబుల్ పోదాం రాంబాబు మండల సీనియర్ నాయకులు పూజారి శ్రీనివాస్ పార్టీ కార్యకర్తలు ఇందార రమేష్ సంతోష్ మురళి రామకృష్ణ ఎర్రంగాని ఆనందం దామోదర్ శ్రావణ్ సోషల్ మీడియా వారియర్ మునిగేల నరేష్ పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333