తప్పెట్ల మోరుసు గ్రామంలో ఇంటికి దారి సరిగ్గా లేక ఇబ్బంది పడుతున్న దివ్యాంగుడు

Aug 14, 2026 - 20:33
Aug 15, 2026 - 04:20
 0  13

 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి : గట్ట మండలం. మండలంలోని తప్పెట్ల మొరుసు గ్రామంలో రెండవ వార్డులో నివాసం ఉంటున్న మల్దకల్ అనే దివ్యాంగుడు ఇంటి ముందర ఇబ్బందికరంగా రోడ్డు మార్గం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.  పలుమార్లు పంచాయతీ సిబ్బందికి తెలియజేసిన స్పందన లేదని అన్నారు. రోడ్డు మార్గం సరిగ్గా లేకపోవడంతో తాను దివ్యాంగుడు కావడం వలన తన ఇంటి దగ్గరకు రావడానికి ఇబ్బందికరంగా మారిందని. రోడ్డు మార్గంలో బురద వర్షపు నీరు నిలువ ఉండకుండగా చర్యలు చేపట్టాలని ఆయన తెలియజేశారు.  గ్రామ ప్రథమ పౌరుడికి అలాగే పంచాయతీ కార్యదర్శికి ఈ విషయాన్ని తెలియజేసిన స్పందన మాత్రం శూన్యమని అన్నారు. దీనిపై ఉన్న అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State