దమ్మపేట పంచాయతీ పరిపాలన అక్రమాలకు అడ్డదారయింది

Aug 28, 2026 - 19:20
 0  3
 దమ్మపేట పంచాయతీ పరిపాలన అక్రమాలకు అడ్డదారయింది

అశ్వరావుపేట నియోజకవర్గం  దమ్మపేట మండలం దమ్మపేట  గ్రామపంచాయతీలో జరుగుతున్నటువంటి అన్యాయాలను గూర్చి సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు పండూరి వీరబాబు మాట్లాడుతూ పంచాయతీ ఆఫీసులో జరుగుతున్న అక్రమాలు గత స్థానిక ఎలక్షన్లో పగడాల రమాదేవి గారు అబద్ధాల హామీలు ఇచ్చి గెలుపు పొందినారు ఆ ఇచ్చిన హామీలు ఇంటి పన్ను పంపు బిల్లు రద్దు అని అన్నారు ఇచ్చిన హామీలను అమలు చేయక గాలికొదిలేసిన వైనం మనం చూస్తున్నాము  ప్రజలు ఇంటి పన్ను కట్టటానికి వెళితే నీ ఇల్లు ఆన్లైన్లో అవలేదు  ఇది తాత్కాలికమైన  నెంబరు అని కొత్తగా మాటలు చెబుతున్నారు గెలిచిన పగడాల రమాదేవి గారు పగడాల రాంబాబు గారు ఇప్పుడు వచ్చిన సెక్రెటరీ ముగ్గురు కూడా ఒకే మాట మీద ఉన్నారు ఇల్లు ఆన్లైన్లో అవ్వనప్పుడు ఇంటి పనులు కట్టమని పంచాయతీ వర్కర్స్ ను ముగ్గురిని మూడు వైపులు పంపిస్తున్నారు మరి ఆన్లైన్లో ఇల్లు అవ్వనప్పుడు ఏ హక్కుతో ఇంటి పన్నులు వసూలు చేస్తున్నారు అని గట్టిగా నిలదీశారు   కనీసం ఒక 25 మంది రసీదులు పట్టుకొని పోతే అన్ని తాతకాలికమైన  నెంబర్లు అని చెప్పారు గతంలో టిఆర్ఎస్ గవర్నమెంట్ సర్పంచులు ఉపసర్పంచులు ఇంటి పన్ను వసూలు చేశారు పదేళ్లు పంచాయతీ పరిపాలన చేసినారు మరి వాళ్ల మీద చర్యలు తీసుకునే బాధ్యత మీకు లేదా ఇలా ఎంతకాలం ప్రజలను మోసం చేసుకుంటూ పరిపాలన చేస్తారు ఇలా ఎంతకాలం.. అంటే మీరు దొంగతనంగా బీరువా పగలగొట్టి రికార్డులు దొంగిలించారు దాన్ని పోలీస్ అధికారులు పరిశీలించి కేసులు పెట్టినాము అని చెప్పిన్నారు మరి వారు జైలుకు వెళ్ళినారా మరి ఈ విషయాన్ని గాలికి వదిలేసి తిరుగుతున్నారు మరి వీళ్ళని ఏమనాలి  ఇద్దరూ దొంగలేనా ఓడిపోయిన అధికారులు దొంగలేనా గెలిచిన వాళ్ళు దొంగలేనా అంటే మీరు ప్రజల్ని మోసం చేస్తున్నారు ప్రతి ఇల్లు కూడా ఆన్లైన్లో లేదు అంటే ఇది ప్రజలకు మీరు అందించాల్సిన సమాచారమేనా ప్రజలకు అబద్ధాల హామీలు ఇచ్చి గెలిచారని ప్రజలు మాట్లాడుకుంటున్నారు  ప్రజల్ని నమ్మించడం కోసం మీరు ఆడుతున్న డ్రామా ఇది మీరు తెలుసుకోవాలి . ఈ ఆన్లైన్ చేసే బాధ్యతని గెలిచిన కాంగ్రెస్ పార్టీ నాయకులు తీసుకుంటారా అంతకు ముందు పరిపాలన చేసిన టిఆర్ఎస్ పార్టీ నాయకులు తీసుకుంటారా మీరు దాన్ని ఆలోచించాలి ఇది తక్షణమే చేయకపోతే ప్రజలందరితో సిపిఐ ఎంఎల్ మాసులైన పార్టీ పంచాయతీ ఆఫీసును ముట్టడిస్తుంది అక్కడ నుంచి కదిలే పరిస్థితి కూడా ఉండదు అని అన్నారు ఇది తప్పు మీరు తప్పు చేస్తున్నారని ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు తప్పుచేసిన వారు బయట తిరుగుతూ ఉన్నారు ప్రశ్నించిన వారిని అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు ఇది ఎక్కడ న్యాయం ఈ అన్యాయాన్ని తీవ్రంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు పండురి వీరబాబు  ఖండిస్తున్నాడు కమ్యూనిస్టురాల్ని కేసులు పెట్టి భయపెట్టాలని చూస్తే కమ్యూనిస్టు ఉద్యమిస్తే ఎంతోమందిని గద్దించిన చరిత్ర ఉంది ఈ విషయాన్ని గమనించాలని మనవి చేస్తున్నాము మిమ్మల్ని పెద్దవాళ్ళు చేయాలంటే మీడియా సోదరులు కావాలి మీరు చేసిన పనులు గొప్పగా రాయాలి మీరు చేసిన తప్పులు ప్రశ్నించే పరిస్థితి వచ్చినపుడు కేసులు పెట్టి జైలుకు పంపిస్తున్నారు వీటిని గూర్చి ఏ మీడియా మిత్రులు పట్టించుకోవటం లేదు దయచేసి మీడియా సోదరులారా ఇలాంటి అక్రమాలను ఖండించాలని మిత్రులను కోరుతున్నాను. తప్పులు చేసిన వాళ్ళ మీద కేసులు అవ్వవా అబద్ధాల హామీలు ఇచ్చి మీరు నెరవేర్చకపోయినా ఆన్లైన్ చేసే బాధ్యత మీరు తీసుకోవాలి గతంలో నాయకులు తప్పు చేశారు అని ఇప్పుడు మీరు అంటున్నారు వాళ్ల మీద చర్యలు తీసుకోండి ప్రజలం మీకు సపోర్ట్ చేస్తారు అని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ పార్టీ నాయకులు  పండూరి వీరబాబు డిమాండ్ చేస్తున్నారు

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333