ప్రతి ఒక్కరూ బాధ్యతగా చెట్లను నాటాలి చెట్లే ప్రగతికి మెట్లు

Aug 14, 2026 - 20:31
Aug 15, 2026 - 04:21
 0  11

కాలుష్యల వల్ల ఏర్పడిన ఎల్ నినో లాంటి ప్రకృతి విపత్తులను ప్రజలు ఎదుర్కోవాలి

పరిసరాల పరిశుభ్రత పాటిస్తూ వర్షాకాలంలో వచ్చే విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని జోరుగా జిల్లా ప్రభుత్వ కళాకారుల అవగాహన కార్యక్రమలు

 జోగులాంబ గద్వాల 14 ఆగస్టు 2026 తెలంగాణ వార్తా ప్రతినిధి :  మానో పాడు మండలం పెద్ద ఆముదాల పాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్  ఆదేశాల మేరకు పౌర సంబంధాల శాఖ అధికారి ఆరిఫ్ ఉద్దీన్ ఆధ్వర్యంలో పరిసరాల పరిశుభ్రతపై మరియు వర్షాకాలం లో వచ్చే వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని విషజ్వరాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కార్యక్రమలు చేపట్టిన తెలంగాణ సాంస్కృతి సారధి ప్రభుత్వ కళాకారుల జిల్లా అధ్యక్షులు మహమ్మద్ రాహుల్, హజరత్.సువర్ణ.రాధ.కేశవులు.డి.కృష్ణయ్య. శ్రీనివాసులు.కేశవులు తమ ఆట పాట మాటలతో. ప్రజలకు ఆరోగ్య జాగ్రత్తల పై అవగాహన కల్పించారు.  పెద్ద ఆముదాల పాడు గ్రామ సర్పంచ్ మరియు ప్రజలు కళాకారుల పాటలకు ముగ్ధులై కళాకారులను మెచ్చుకున్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గారు వార్డు సభ్యులు పంచాయితీ కార్యదర్శి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State