అయిజలో తైబజార్ వేలంపాట రద్దు..కమిషనర్ సైదులు

జోగుళాంబ గద్వాల 4 మే 2025 తెలంగాణ వార్త ప్రతినిధి: అయిజ మున్సిపల్ తైబజార్ వేలంపాటను రద్దు చేస్తున్నట్లు మున్సిపల్ కమిషనర్ సైదులు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 30-4-2025న మున్సిపల్ కార్యాలయంలో తై బజార్ వేలంపాట నిర్వహించామని,అట్టి వేలంపాటను పట్టణ ప్రజలు,చిరు వ్యాపారుల సౌకర్యార్థం, ఉన్నతాధికారుల ఆదేశం మేరకు రద్దు చేసినట్లు ప్రకటించారు. విషయాన్ని చిరు వ్యాపారులు, పట్టణ ప్రజలు గ్రహించాలని కోరారు..