డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను వార్షిక తనికి చేసిన ఎస్పీ నరసింహ

Aug 27, 2026 - 13:54
 0  2
డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను వార్షిక తనికి చేసిన ఎస్పీ నరసింహ
డీఎస్పీ కార్యాలయం, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను వార్షిక తనికి చేసిన ఎస్పీ నరసింహ

- నేరాల అదుపుకు, ప్రమాదాల నివారణకు ప్రణాళికతో పోలీసు కృషి.
- ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు.
- మహిళ భద్రతకు ప్రాధాన్యం.
- రోడ్డు ప్రమాదాలు జరగకుండా చర్యలు.
- సామాజిక అంశాల పట్ల ప్రజల్లో చైతన్యం.

.. సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్.

"రహదారులపై వాహనాలు బ్రేక్ డౌన్ ఐతే డయల్ 112 కు ఫోన్ చేసి ప్రమాదాల నివారణ చర్యలు తీసుకోవాలని వాహనదారూలకు సూచించారు."

పోలీసు స్టేషన్ ల, పోలీసు కార్యాలయాల వార్షిక తనికిలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ గారు కోదాడ డివిజన్ డీఎస్పీ కార్యాలయాన్ని, కోదాడ పట్టణ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లను తనికి చేశారు. పోలీసు సిబ్బంది కవాతును పరిశీలించారు, ఆయా కార్యాలయాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగినది. ప్రజల భద్రతలో అనుక్షణం కృషి చేయాలని ఆదేశించారు. సాంకేతిక సద్వినియోగంతో స్మార్ట్ పోలీసింగ్ నిర్వహించాలని సూచించారు.

ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తనిఖీ... ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు డ్రంకన్ డ్రైవ్ రిజిస్టర్, ఎన్ఫోర్స్మెంట్ రిజిస్టర్ లు పరిశీలించారు. పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణ పునరుద్ధరణకు ట్రాఫిక్ పోలీస్ కృషి చేయాలి, ఆపరేషన్ రోప్ ను సమర్థవంతంగా అమలు చేయాలి, మద్యం మత్తులో వాహనాలు నడిపితే కేసులు నమోదు చేసి జైలుకు పంపించాలి, యువత డ్రైవింగ్, మైనర్ డ్రైవింగ్ పై దృష్టి పెట్టాలి స్పెషల్ డ్రైవ్స్ , ట్రాఫిక్ ఉలంగాలపై ఆకస్మిక తనికీలు చేయాలని ట్రాఫిక్ పోలీసులను ఆదేశించారు. 

డీఎస్పీ కార్యాలయం తనిఖీ.. కార్యాలయం నందు నిర్వహిస్తున్న వివిధ రకాల రిజిస్టర్ లు పరిశీలించారు. వరకత్నపు హత్య, ఆత్మహత్యల కేసులు, తీవ్రమైన చీటింగ్ కేసులు, అట్రాసిటీ కేసులు, మైనర్ లపై వేధింపుల కేసులు మొదలగు వాటిల్లో డిఎస్పీ దర్యాప్తు అధికారిగా ఉంటారు ఇలాంటి కేసుల పురోగతిని పరిశీలించారు. డివిజన్ పరిధిలో ఉన్న అన్ని పోలీసు స్టేషన్ ల పనితీరుపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని, సిబ్బంది పనితీరును మెరుగయ్యేలా కృషి చేయాలని డిఎస్పీ కి తెలిపినారు. సామాజిక అంశాల పట్ల, భద్రత అంశాల పట్ల ప్రజలను చైతన్య పరచాలి అని సూచించారు. రోడ్డు ప్రమాదాలను నిర్మూలించడంలో కృషి చేయాలీ, రహదారుల వెంట ఉన్న గ్రామాల ప్రజలను, హోటల్స్, టి దుకాణాలు ఇతర వ్యాపారాల నిర్వాహకులను చైతన్యపరిచి రోడ్డు ప్రమాదాలు జరగకుండా వారి వ్యాపారాల వద్ద జాగ్రతాలు పాటింపచేయాలి. CCTV కెమెరాల ఏర్పాటు చేయాలి. రహదారి భద్రతకు అన్ని శాఖలతో సమన్వయంతో పని చేయాలి హైవే పెట్రోలింగ్ నిరంతరం చేయాలి, వాహనాలు అక్రమ పార్కింగ్ చేయకుండా ఎన్ఫోర్స్మెంట్ చేయాలని సూచించారు. సైబర్ మోసాల పట్ల ప్రజలను చైతన్యం చేయాలి మునగాల, నడిగుడెం, చిలుకూరు మండలాల పరిధిలో గ్రామాల్లో యువతకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించారు, ఇక్కడ కొంత మంది అత్యాశకు పోయి ఆన్లైన్ పెట్టుబడుల విషయంలో సైబర్ మోసగాళ్ల మాయలో పడ్డారు, పరేషాన్ క్రాక్ డౌన్ ద్వారా చర్యలు చేపట్టగా ఈ ప్రాంతలో సైబర్ నేరాలు అదుపు చేశాం అన్నారు.

ఈ తనిఖీల్లో కోదాడ డివిజన్ డిఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, ఇన్స్పెక్టర్ లు శివశంకర్, చరమందరాజు, రామకృష్ణా రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ అంజిరెడ్డి, ఎస్ఐ లు నవీన్, మోహన్, స్టోర్ ఆర్ఎస్ఐ అఖిల్, డిసిఆర్బీ సిబ్బంది అంజన్ రెడ్డి, శేఖర్ రెడ్డి, సీసీ సందీప్, టెక్నికల్ కానిస్టేబుల్ అబెద్, సిబ్బంది ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333