పోలీస్ హెచ్చరిక - రహదారి భద్రత మన అందరి బాధ్యత !!

Aug 27, 2026 - 13:52
 0  1
పోలీస్ హెచ్చరిక - రహదారి భద్రత మన అందరి బాధ్యత !!

సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ.

వాహన యజమానులకు భారీ జరిమానా! జాతీయ రహదారులపై మరియు జిల్లాలోని ఇతర ప్రధాన రహదారుల వెంట నిబంధనలకు విరుద్ధంగా, ఎక్కడపడితే అక్కడ అనుమతిలేకుండా వాహనాలను నిలిపే వారిపై సూర్యాపేట జిల్లా పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటాం అని సూర్యాపేట జిల్లా ఎస్పి నరసింహ తీవ్రంగా హెచ్చరించారు.

నిబంధనలు ఉల్లంఘించిన లారీ యజమానులకు భారీగా జరిమానాలు విధిస్తున్నారు. రహదారుల వెంట హోటల్స్, పంక్చర్ షాప్స్, టి దుకాణాలు ఇతర వ్యాపారాలు చేసేవారు బాధ్యతగా ఉండాలి, జాగ్రత్తలు పాటించాలి.

ముఖ్య గమనిక & హెచ్చరిక: రోడ్డు ప్రమాదాలకు కారణం: రహదారుల పక్కన, సర్వీస్ రోడ్లపై ఇష్టానుసారంగా వాహనాలు నిలపడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలు ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు.

కఠిన చర్యలు: హైవేలపై తనిఖీలు నిరంతరం కొనసాగుతాయి. నిబంధనలు పాటించకుండా వాహనాలు పార్క్ చేస్తే మోటార్ వాహనాల చట్టం ప్రకారం కఠినమైన చట్టపరమైన చర్యలు ఉంటాయి.

పార్కింగ్ నియమాలు: వాహనదారులు, లారీ డ్రైవర్లు ఇతర వాహనాలను కేవలం రోడ్డు కు దూరంగా నిలుపుకోవాలి. రహదారుల వెంట ఎక్కడపడితే అక్కడ వాహనాలు నిలిపితే కఠిన చర్యలు తప్పవు. 

"రోడ్డు ప్రమాద రహిత సూర్యాపేట జిల్లా నిర్మాణానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి."

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333