విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి

Aug 28, 2026 - 00:08
Aug 28, 2026 - 00:09
 0  5
విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రి

మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నం

ములుగు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుకాకులమర్రి లక్ష్మణ్ బాబు 

ములుగు జిల్లా, ఆగస్టు 27:- పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను తెలుసుకునేందుకు వరంగల్ వచ్చిన హరీష్ రావుని అరెస్టు చేసి సుబేదారి పోలీస్ స్టేషన్‌కు తరలించడం రేవంత్ రెడ్డి ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని కాకులమర్రి లక్ష్మణ్ బాబు తీవ్రంగా ఖండించారు.స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో శక్తి యూనివర్సిటీ 97వ జీవో పీపీపీ విధానాల ద్వారా పాలిటెక్నిక్ విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు అనేక అనుమానాలకు తావిస్తున్నాయని ఆయన అన్నారు.ఈ విధానం నిజంగా విద్యార్థుల ప్రయోజనాల కోసమే అయితే ప్రభుత్వం బహిరంగంగా వివరాలు వెల్లడించి విద్యార్థులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలు ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ పేద విద్యార్థులకు సాంకేతిక విద్యకు ప్రధాన ఆధారం. వాటిని బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం పీపీపీ పేరుతో వాటి భవిష్యత్తును ప్రశ్నార్థకం చేయడం సరికాదన్నారు.ప్రభుత్వ కళాశాలల భూములు ఆస్తులు ప్రజల ఆస్తులని కార్పొరేటర్ల ప్రైవేటు వ్యక్తుల చేతిలో పెట్టడానికి చూస్తున్న రేవంత్ రెడ్డి విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నావు అని మండిపడ్డారు.విద్యార్థుల భవిష్యత్తుపై ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం కాదు ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.పాలిటెక్నిక్ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడితే విద్యార్థి లోకం ప్రజలు తగిన సమాధానం చెబుతారన్నారు.
హరీష్ రావుని మాజీ మంత్రివర్యులు ఎర్రబెల్లి దయాకర్ రావుని పళ్ళ రాజేశ్వర్ రెడ్డి రెడ్డిని దాస్యం వినయ్ భాస్కర్ అరెస్టును తీవ్రంగా ఖండిస్తూ పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలపై ప్రభుత్వం వెంటనే బహిరంగ చర్చకు రావాలని కాకులమర్రి లక్ష్మణ్ బాబు డిమాండ్ చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333