పంచాయతీ ఎన్నికలకు సిద్ధం

Nov 25, 2025 - 19:35
 0  2
పంచాయతీ ఎన్నికలకు సిద్ధం

 ఎన్నికల సంఘానికి ప్రభుత్వం లేఖ!

హైదరాబాద్ :నవంబర్ 25 తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్ల ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది, ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘానికి వివరాలు సమర్పించి ఎన్ని కలకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది, అన్ని జిల్లాల కలెక్టర్లు సమర్పించిన సర్పంచి వార్డు సభ్యుల గెజిట్ లను ప్రభుత్వం ఎస్ఈసీకి, పంపింది..

దీంతో ఏ క్షణమైనా ఎన్ని కల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలిసిన వివరాల ప్రకారం డిసెంబర్ 11న తొలి విడత 15న రెండో విడత 19న మూడో విడత ఎన్నికలను నిర్వహిం చాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్ తెలిపింది,

మరోవైపు ఎన్నికల కోడ్ అమల్లోకి రాకముందే చీరలు పంపిణీతోపాటు వడ్డీ లేని రుణాల అమలుపై రేవంత్ రెడ్డి సర్కార్ స్పీడ్ పెంచింది. ఇప్పటికే మహిళలకు చీరల పంపిణీని ప్రభుత్వం ప్రారంభించింది. తాజాగా రాష్ట్రవ్యాప్తంగా రూ. 304 కోట్ల వడ్డీ లేని రుణాలను 3,57,098 గ్రామీణ మహి ళా స్వయం సహాయక సంఘాల ఖాతాల్లో నగదును మంగళవారం జమ చేయనున్నారు.

ఇప్పటికే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. అదే ఉత్సాహంతో పంచాయతీ ఎన్నికల్లో సైతం గెలుపొందాలని కేడర్‌ను ఆ పార్టీ నేతలు సమాయత్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కూడా ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తోంది. బీజేపీ సైతం అదే బాటలో సాగుతోంది. 

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పలు కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని తెలుస్తోంది...

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333