నేలకొండపల్లి మండలంలో ఇందిరమ్మ ఇల్లు పంపిణీకి ముఖ్య అతిథిగా ఎంపీ రఘురాం రెడ్డి

తెలంగాణ వార్త ప్రతినిధి నేలకొండపల్లి :- ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండలంలో ఇందిరమ్మ ఇండ్ల పట్టాల పంపిణీ – ఎంపీ రఘురాం రెడ్డి ముఖ్య అతిథిగా హాజరు ఖమ్మం జిల్లా నేలకొండపల్లి మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ఖమ్మం ఎంపీ శ్రీ రఘురాం రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన రైతులకు జీలుగులు ను అందజేశారు. ఈ సందర్భంగా నేలకొండపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వెన్నుపూసల సీతారాములు మాట్లాడుతూ, “ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అధికారులు సమర్థవంతంగా చర్యలు తీసుకున్నారు. మా మండలానికి అదనంగా ఇళ్ల మంజూరులో రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి సహకారం విలువైనది. ఆయనకు మండల ప్రజల తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం,” అని తెలిపారు. అలాగే, “ఇందిరమ్మ ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలుగా మద్దతు లభిస్తోంది. రైతులందరికీ త్వరలోనే బోనస్ అందుతుంది. ప్రభుత్వం వారిని అన్ని విధాలా రక్షిస్తూ ముందుకు తీసుకెళ్తోంది,” అని ఆయన పేర్కొన్నారు.లబ్ధిదారులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారని, గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేదల కలను నిజం చేస్తూ ఇందిరమ్మ ప్రభుత్వ పథకం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.