నెర్రెలు బాసిన పంట పొలాలు
తిరుమలగిరి 26 ఆగస్టు 2024 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి: యాసంగి పంటకు సాగునీరు లేక ఎండిపోతున్న వరి పంట పొలాలు అయోమయంలో రైతాంగం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు పడకపోవడంతో వ్యవసాయానికి సరిపోయేంత నీళ్లు లేక పంట పొలాలు నెర్రెలుబారి ఎండిపోతున్నాయి.తుంగతుర్తి నియోజకవర్గ వ్యాప్తంగా పచ్చగా కళ కళలాడుతున్న పంట పొలాలు కాస్తా.. ఎండిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో రైతాంగానికి ఎస్సారెస్పీ కాలువ ద్వారా సాగునీరు అందించి ఉంటే కాస్తయినా పంటలను కాపాడుకునేవారమని రైతులు వాపోతున్నారు.చివరికి బిక్కేరు వాగుల పొంటివున్న పొలాలు సైతం భూగర్భ జలాలు అంతరించిపోయి ఏటి బోర్లు సైతం వట్టిపోతున్నాయి.ప్రభుత్వ యంత్రాంగం రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని త్వరితగతిన వ్యవసాయానికి సాగునీరు విడుదల చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు