నూతన రెవిన్యూ యాక్ట్ పై రేపు మేధావులతో సమావేశం

Aug 22, 2024 - 19:24
 0  9
నూతన రెవిన్యూ యాక్ట్ పై రేపు మేధావులతో సమావేశం

జోగులాంబ గద్వాల 22 ఆగస్టు 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- నూతనంగా ఏర్పాటు చేయనున్న రెవెన్యూ యాక్ట్ (ROR) చట్టం - 2024 పై అభిప్రాయ సేకరణ కొరకు జిల్లాలోని మేధావులు, సీనియర్ సిటిజెన్లతో సమావేశం నిర్వహిస్తున్నాట్లు జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్  గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.రేపు (23న (శుక్రవారం) )సాయంత్రం 4:00 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించే సమావేశంలో సీనియర్ సిటిజన్లు, మేధావులు, రైతు సంఘాల సభ్యులు, విద్యావేత్తలు, ప్రజాప్రతినిధులు, రిటైర్డ్ రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించి వారి అమూల్యమైన సూచనలు, సలహాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందరూ ఇట్టి కార్యక్రమంలో అధిక సంఖ్యలో పాల్గొని చట్టాన్ని పక్కాగా అమలుపరిచేందుకు తమ సూచనలు, సలహాలను అందజేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333