నిరుపేద మహిళా కుటుంబానికి అండగా నిలిచిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు 

Feb 20, 2025 - 19:56
 0  66
నిరుపేద మహిళా కుటుంబానికి అండగా నిలిచిన తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు 

అడ్డగూడూరు 20 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకుడు బాలెంల మహేందర్ మాతృమూర్తి బాలెంల సుగుణమ్మ గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.ఇట్టి విషయం తెలుసుకున్న తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు బాలెంల సుగుణమ్మ ని పరామర్శించి వారి కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇవ్వడం జరిగింది.తదనంతరం 5వేల రూపాయల ఆర్థిక సహాయం అందించడం జరిగింది.ఇట్టి కార్యక్రమంలో అడ్డగూడూరు పిఎసిఎస్ చైర్మన్ కోప్పుల నిరంజన్ రెడ్డి,అడ్డగూడూరు మండల కాంగ్రెస్ పార్టీ  అధ్యక్షులు నిమ్మన గోటి జోజీ,టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలెంల సైదులు,కేసరపు శ్రీనివాస్ రెడ్డి,మోత్కూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ బాలెంల విద్యాసాగర్, మోత్కూర్ మార్కెట్ మాజీ డైరెక్టర్ బోడ యాదగిరి యూత్ కాంగ్రెస్ మండల ఉపాధ్యక్షులు మేకల పవన్,వెల్దేవి గ్రామశాఖ అధ్యక్షులు మట్టిపెల్లి గంగయ్య,కాంగ్రెస్ పార్టీ నాయకులు బాలెంల సురేష్ ,జనార్థన్,నరేష్,మందుల సోమన్న,యూత్ కాంగ్రెస్ నాయకులు బాలెంల జీవన్,పోలెపాక ఉపేందర్,ఉదుగు మల్లేశ్,నిఖిల్,పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333