ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాలు

Mar 2, 2025 - 21:16
Mar 2, 2025 - 21:18
 0  21
ప్రజల ఆరోగ్యం కోసమే ఉచిత వైద్య శిబిరాలు

సువెన్ ఫార్మా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు

సూర్యాపేట  2 మార్చి 2025 తెలంగాణ వార్త ప్రతినిధి:- ప్రజల ఆరోగ్యం కోసం ఉచితంగా వైద్య శిబిరాలు నిర్వహించి వారికి కావలసిన మందులను కూడా ఉచితంగానే అందజేస్తున్నామని సువర్ ఫార్మా అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ బాబు చెప్పారు. సువెన్ ఫార్మా వారి సామాజిక బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఉచిత వైద్య సివెన్ ఫార్మా పక్కన గల భరోసా సెంటర్లో శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా  రమేష్ బాబు  మాట్లాడుతూ ఉచిత వైద్య శిబిరాన్ని సువెన్ ఫార్మ పరిసర ప్రాంత ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవడం హర్షనీయమన్నారు. ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకొని ప్రజలు తమ ఆరోగ్యాన్ని మెరుగు పరుచుకోవాలని కోరారు. సూర్యాపేట పరిసర ప్రాంతాలలో ఎక్కువమంది డయాబెటిస్, బీపీ లాంటి జీవనశైలి వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఆరోగ్య విషయంలో ఇలాంటి వ్యాధులు కొంచెం కలవరం పెట్టడం బాధాకరమన్నారు. బ పోషక విలువలు కలిగిన మంచి ఆహారాన్ని, ఆరోగ్య నియమాలను, వ్యాయామ నియమాలను అవలంబిస్తూ జీవనశైలి వ్యాధులను నివారించుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం కోసం సువెన్ ఫార్మా నిరంతరం ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతుందని హామీ ఇచ్చారు.  ప్రతి వైద్య శిబిరంలో నెలకు సరిపడామందులను పూర్తిగా ఉచితంగా పంపిణీ చేస్తున్నామన్నారు. ఉచిత వైద్య శిబిరంలో జనరల్ ఫిజీషియన్, గైకనాలజిస్ట్, ఆర్థోపెడిక్ డాక్టర్లను అందుబాటులో ఉంచి అన్ని రకాలుగా పరీక్షలు ఉచితంగా జరుపుతున్నామని వివరించారు. ప్రజల ఆరోగ్యం కోసం సువన్ ఫార్మా చేపడుతున్న వైద్య శిబిరాలను ప్రజలు ఉపయోగించుకొని వ్యాధులను తగ్గించుకోవాలని, తద్వారా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని రమేష్ బాబు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ ఆర్ ఇన్చార్జి పిఎస్ఎన్ మూర్తి, కార్పొరేట్ ఎఫైర్స్ హెడ్ వరప్రసాద్ రెడ్డి, హెచ్ఆర్ హెడ్ వెంకట రమణ, పీవీ రమణ,ఎం వి రమణ, డిప్యూటీ మేనేజర్ సైదులు, క్యాప్షన్ మేనేజర్ జీవన్ నాయక్, సువేన్ సిబ్బంది,పరిసర ప్రాంత ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333