నిజమైన ఘనమైన జీవిత చరిత్ర చావా సినిమా.
దేవకి వాసుదేవ రావు
ఖమ్మం పట్టణంలో ఆదివారం వినోద థియేటర్ లో శ్రీశ్రీశ్రీ చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తీసిన చావ సినిమాను ఫ్రీ షో ను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు దేవకి వాసుదేవరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... భారతదేశ ప్రజలందరూ ముఖ్యంగా యువత చావా సినిమాను కచ్చితంగా చూడాల్సిందిగా కోరారు . చావా సినిమా ద్వారా నాటి నిజమైన ఘనమైన చరిత్రను ప్రజల ముందుకు తీసుకు వచ్చినటువంటి చావా సినిమా బృందానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు . నాడు హిందువుల పైన దాడులను చూసి నాటి మొగల్ రాజులను ఎదిరించి నిలిచిన గెరిల్లా యోధుడు శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ మహారాజు అని కొనియాడారు . వారు చేసిన పోరాటాన్ని ఆదర్శంగా తీసుకొని చిన్ననాటి నుండే తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ.. శివాజీ మరణ అనంతరం తండ్రికి తగ్గ తనయుడిగా శత్రువుల గుండెల్లో అగ్గి రగిలించిన శంభాజీ మహారాజ్ . వారి చరిత్ర నేటి యువత ప్రతి ఒక్కరూ చూసి... దేశం కోసం ధర్మం కోసం వారు ఎంతటి త్యాగానికైనా కూడా వెనకాడని వారి ధైర్య సాహసాలను చూడడమే కాదు... వారు ఆలోచించినట్టుగా దేశం కోసం ధర్మం కోసం మనం ఎందుకు ఆలోచించకూడదు అని ప్రశ్న ప్రతి ఒక్కరు వేసుకోవాలని అన్నారు . చత్రపతి శంభాజీ మహారాజ్ ని మొగలులు చిత్రహింసలకు గురి చేసినప్పటికీ కూడా వారికి ఏ మాత్రం తలగకుండా నిలిచిన గొప్ప యోధుడు శంభాజీ మహారాజ్... శత్రువులే ఆశ్చర్యపడే విధంగా పుడితే శంబాజీ మహరాజ్ లాంటి ఒక్క కొడుకు పుట్టాలి అనే విధంగా నిలిచారు . నేడు హిందూ సంస్కృతి , సాంప్రదాయాల పైన ఏ విధంగా దాడులు జరుగుతున్నాయో అందరూ చూస్తూనే ఉన్నారు . ఇప్పటికైనా ఓ భారతదేశ యువతరమా.. ఈ సినిమా చూసినాక నైనా ఒక్కొక్క హిందూ యువత ఒక్కొక్క శ్రీశ్రీశ్రీ చత్రపతి శివాజీ , శ్రీశ్రీశ్రీ చత్రపతి శంభాజీ మహారాజుల మాదిరిగా పోరాటం చేసి మన ధర్మ రక్షణకు పాల్పడాల్సిందిగా విజ్ఞప్తి చేశారు . ప్రతి ఒక్క తల్లిదండ్రులు తమ తమ పిల్లలకి చిల్లర సినిమాలు కంటే ఇలాంటి సినిమా ఒక్కటి చూపెట్టండి వారు భవిష్యత్తులో ధర్మరక్షణకు ఏ విధంగా పాల్పడతారో ఒక్కసారి ఆలోచన చేయాల్సిందిగా విజ్ఞప్తి చేశారు . ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు , హిందూ సంఘాల నాయకులు , విద్యార్థి సంఘాల నాయకులు , ప్రభుత్వ అధికారులు , పిల్లలు తదితరులు పాల్గొన్నారు .