నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన...

Sep 17, 2024 - 22:02
 0  15
నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన...
నాగర్ దొడ్డి గ్రామాన్ని సందర్శించిన...

జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ...

జోగులాంబ గద్వాల 17 సెప్టెంబర్ 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి.

గద్వాల. నియోజకవర్గం మల్దకల్ మండల పరిధిలోని నాగర్ దొడ్డి గ్రామంలో నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా అక్కడ నిర్మించిన నాగర్ దొడ్డి రిజర్వాయర్ కు గత వారంలో కురిసిన వర్షాలకు నీటి నిల్వ ఎక్కువ కావడంతో గ్రామంలోని ఇండ్లలో నీరు ఊటగా వస్తుండటంతో బయందోళన విషయం తెలుసుకున్న జెడ్పి మాజీ చైర్ పర్సన్, కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇంచార్జీ సరితమ్మ గ్రామంలో సందర్శించారు.. నాగర్ దొడ్డి రిజర్వాయర్ క్రింద ఉన్న మా గ్రామానికి ముప్పు గ్రామంగా గుర్తించాలని కోరారు.. త్వరలోనే నాగర్ దొడ్డి గ్రామ ప్రజల సమస్యలను పరిష్కరించడానికి సిఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకుని వెళ్ళి త్వరితగతిన సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని గ్రామస్థులకు సరితమ్మ హామీ ఇచ్చారు.. అనంతరం గ్రామంలోని పాఠశాలలో మధ్యాహ్న భోజన సమయంలో ఆకస్మిక తనిఖీ చేసిన సరితమ్మ... విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెట్టాలని ఆదేశించారు....

వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్వాల రాజశేఖరరెడ్డి, పెదొడ్డి రామకృష్ణ, శంకర్,బాలు,మాజీ ఎంపిటిసి రాముడు,భగవంతు, లక్ష్మినారాయణ, మోహన్ గౌడ్, మల్లీ గౌడ్, నర్సింహులు, రాము తదితరులు ఉన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333