పదో బెటాలియన్ లో ఘనంగా ప్రజా పాలన దినోత్సవం
జోగులాంబ గద్వాల సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి.
మండలంలోని పదో బెటాలియన్ లో మంగళవారం తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ కమాండెంట్ కే సుబ్రహ్మణ్యం జాతీయ పథకాన్ని ఎగరవేసి అనంతరం మాట్లాడుతూ 1947 ఆగస్టు 15 బ్రిటిష్ పాలన నుంచి దేశ ప్రజలకు విముక్తి కలిగింది. కానీ తెలంగాణ ప్రజలకు నిజం నిరంకుశ పాలన నుంచి విముక్తి కలగలేదన్నారు. మాజీ ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెలంగాణ స్వతంత్ర భారతదేశం లో విలీనమైన ఈరోజును తెలంగాణ ప్రభుత్వం ప్రజా పాలన దినోత్సవం గా నిర్వహించుకోవడం సంతోషకరమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆసిస్టెంట్ కమాండెంట్ శ్రీనివాసరావు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు గోపాల్,రాజారావు,వెంకటేశ్వర్లు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.