జడ్.పి.హెచ్.ఎస్ మల్దకల్ పూర్వ విద్యార్ధులు1997-98 బ్యాచ్ మిత్రబృందం ఆర్థిక సహాయం

జోగులాంబ గద్వాల 3 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మల్డకల్ 1997-98 బ్యాచ్ విద్యార్థి వెంకటేష్ గౌడ్ నీలిపల్లి గ్రామం అనారోగ్యంతో నాలుగు రోజుల క్రితం మరణించడం జరిగింది. తల్లి, భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు వారి ఆర్థిక పరిస్థితి బాగలేదు అని తెలుసుకోన్న వారి మిత్రులు 1997-98 పదవతరగతి మిత్రబృందం అందరూ కలిసి ఈరోజు వెంకటేష్ గౌడ్ భార్య వారి పిల్లలకు మేము ఉన్నాము అని ధైర్యంగా ఉండాలని ఆత్మస్థైర్యాన్ని నింపి మంచి మిత్రుడిని కోల్పోయామని భవిష్యత్తులో వారి కుటుంబానికి అండగా ఉంటాము అని ప్రస్తుతనికి 25000/- ఆర్థిక సహాయం చేయడం జరిగింది. మిత్రబృంద సభ్యులు.ఈ కార్యక్రమంలో బసవరాజు, నరసింహయ్య శెట్టి, రాఘవేందర్ గౌడ్, ప్రవీణ్ కుమార్ శెట్టి, కుమ్మరి శేఖర్, మహేశ్వరప్ప, ఉప్పరి తిమ్మప్ప, భీమరాయుడు, ఉప్పరి మల్దకల్ ,ఆంజనేయులు, శివారెడ్డి, ఉప్పరి మల్దకల్, మొదలైనన వారు పాల్గొన్నారు.