నవ సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు.

Sep 21, 2024 - 17:40
 0  16
నవ సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు.
నవ సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు.

విద్యార్థులను సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి
శాలిగౌరారం 21 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో పనిచేస్తూ.. ఇటీవల ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై అవార్డులు అందుకున్న18మంది ఉపాధ్యాయులకు మండల విద్యాశాఖ ఆధ్వర్యంలో చేసిన సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరయ్యారు.ఈ సమావేశాన్ని ఉద్దెశించి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..నవ సమాజ నిర్మాతలే ఉపాధ్యాయులు,
విద్యార్థులను సన్మార్గంలో నడిపించే బాధ్యత ఉపాధ్యాయులదే అని పేర్కొన్నారు.సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర గొప్పది విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తి మహోన్నతమైనదని కొనియాడారు.రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల బలోపేతం కోసం అన్ని చర్యలు చేపడుతుందని అన్నారు.సామాజిక రుక్మధులను రూపుమాపేందుకు కృషి చేయాలని కోరారు.గత పది సంవత్సరాలనుండి నిర్వీర్యం అయిన ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం చేసేదిశగా ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అని అన్నారు. ఉపాధ్యాయులు అంటే కేవలం గురువులే కాదు విద్యార్థుల భవిష్యత్ ను తీర్చి దిద్దే దర్శకులు గుర్తుచేశారు. విద్యార్థులకు సబ్జెక్ట్ ల తో పాటు వారిలో దాగిఉన్న నైపుణ్యాలను గుర్తించి ఆదిశగా ప్రోత్సహించాలని కోరారు.ఉత్తమ ఉపాధ్యాయులుగా అవార్డు అందుకున్న ఉపాధ్యాయులను అభినందించారు.అనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని సన్మానించి ప్రశంసా పత్రాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా శాఖ అధికారి నాగయ్య, తాసిల్దార్ యాదగిరి,ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, ఉపాధ్యాయులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333