నల్గొండ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సమావేశం

Jan 26, 2026 - 19:09
 0  2
నల్గొండ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సమావేశం

వేముల శ్రీను 25జనవరి తెలంగాణ వార్త  ప్రతినిధి : నల్గొండ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ జిల్లా సమావేశం నల్గొండ జిల్లా కేంద్రంలో విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పీ) జిల్లా స్థాయి సమావేశం ఈరోజు ఘనంగా నిర్వహించబడింది. ఈ సమావేశంలో హిందూ సమాజాన్ని సంఘటితం చేసి చైతన్యవంతం చేయాలనే లక్ష్యంతో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేవాలయాలను కేంద్రాలుగా చేసుకొని సత్సంగాల నిర్మాణం చేపట్టాలని, యువత మానసికంగా మరియు శారీరకంగా బలవంతంగా ఎదగడానికి నిరంతరం వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. అలాగే బలోపాసన కేంద్రాలు, చిన్నారుల కోసం బాల సంస్కార కేంద్రాలు, మాతృమూర్తుల కోసం మాతృశక్తి సత్సంగాలు, యువతీయువకుల కోసం శక్తి సాధన కేంద్రాలు ఏర్పాటు చేసి నిరంతరం కార్యక్రమాలు నిర్వహించాలని తీర్మానించారు.

ఈ సమావేశంలో తెలంగాణ ప్రాంత ధర్మ ప్రసాద్ ప్రముఖులు వెంకట్ యాదవ్, నల్గొండ జిల్లా విభాగ కార్యదర్శి గంజి సుధాకర్ జీ, జిల్లా అధ్యక్షులు ఉమాకర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి జూకూరి సంపత్ వర్మ, జిల్లా సహ కోశాధికారి కర్నాటి వెంకటేశం, జిల్లా సంఘటన మంత్రి మెరుగు వంశీ తదితర జిల్లా ఆయాం ప్రముఖులు, సహ ప్రముఖులు, ప్రఖండ అధ్యక్షులు పాల్గొన్నారు. మొత్తం 10 మండలాల నుంచి 33 మంది కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొని, సంస్థాగత కార్యక్రమాలను బలోపేతం చేయడానికి తమ వంతు కృషి చేయాలని సంకల్పం వ్యక్తం చేశారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333