ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలి...
మునగాల 21 అక్టోబర్ 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి:- తాడ్వాయి సింగిల్ విండో సొసైటీ వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని మండల తాహశీల్దార్ వలిగొండ ఆంజనేయులు ఎంపిడిఓ రమేష్ దిన్ దీయార్ కొరారు.
మండలంలో సోమవారం తాడ్వాయి సొసైటీ వారు ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని స్థానిక తాహశ్ధీర్ వలిగొండ ఆంజనేయులు ప్రారంభించి మాట్లాడారు.సన్న రకం ధాన్యానికి ప్రభుత్వం రూ 500, బోనస్ ఇస్తుందాన్నారు.ఈ కార్యక్రమంలో కోదాడ డివిజన్ వ్యవసాయ అధికారి డి యల్లయ్య, తాడ్వాయి గ్రామ పంచాయతీ ప్రత్యేక అధికారిని వంసత, ఎఓలు భవాణి, నాగుల్, మునగాల సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు బుర్రి శ్రీరాములు, కాంగ్రెస్ పార్టీ నాయకులు గన్నా నర్సింహరావు, సిఇఒలు నాగేందర్, కోటయ్య, మారం సుధాకర్ రెడ్డి, వెంకట రెడ్డి, పత్తిపాక లక్ష్మి నారాయణ,బి వెంకటేశ్వర్లు,నలమాద వెంకటేష్, సొసైటీ సిబ్బంది హమాలీ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.