కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ గురించి""శ్రీయుత జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి
శ్రీయుత జిల్లా కలెక్టర్ సూర్యాపేట గారికి
ఆర్య
కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ కు నాగుబండి పద్మయ్య సర్వేనెంబర్ 149 లో రెండు ఎకరాముల భూమిని దాన పత్రం ద్వారా 1963 లో ఇచ్చినారు. 1964 లో డైరెక్టర్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారు హాస్పిటల్ నిర్మాణం కొరకు ప్లానింగ్ ఇస్తూ హాస్పటల్ తూర్పు, పడమర రెండు వైపులా 30 అడుగుల రోడ్లతో దక్షిణం ఉన్న ఎన్ హెచ్ 9 హద్దు నుండి 25 అడుగుల సెట్ బ్యాక్ తో రెండు ఎకరములలో హాస్పటల్ నిర్మాణం కొరకు ప్లాన్ ఇచ్చి ఉన్నారు.
అప్పటి కోదాడ పంచాయితీ సమితి వారు నిధులు కేటాయించగా కాంట్రాక్టర్ తూర్పు,పడమర రెండు వైపులా 30 అడుగులు వదిలి ఎన్ హెచ్ 9 ను హద్దును ఆనుకుని ఎలాంటి సెట్ బ్యాక్ లేకుండా ఒక ఎకరం 30 గుంటలలో కాంపౌండ్ వాల్ నిర్మాణం చేసినాడు.అప్పటి మండల పంచాయతీ ఇంజనీరింగ్ అధికారుల పర్యవేక్షణ లోపంతో అలా జరిగినది.
1968 నాగుబండి పద్మయ్య పెద్ద కుమారుడు వీరయ్య ప్రభుత్వ హాస్పిటల్కుపడమరవున్నరోడ్డును 18 అడుగులు ఆక్రమించి సర్వే నెంబర్ 149కు బదులుగా 208 సర్వే నెంబర్ వేసి ప్లాట్లు చేసి 534 చదరపు గజములు 2 రిజిస్ట్రేషన్ ల ద్వారా అమ్ము కున్నాడు. సర్వే నెంబర్ 149 లో ఉన్న 8ఎకరముల 27 గుంటల భూమిని 1986-87 లలో తాసిల్దార్ నాగుబండి పద్మయ్య కుమారులైన వీరయ్య కు 4 ఎకరాల 22 గుంటలు, వెంకట నరసయ్యకు 4 ఎకరాల 5 గుంటలు గా రెవిన్యూ రికార్డులు ట్యాంపరింగ్ చేసి పట్టాదారులుగా నమోదు చేసి పట్టాదార్ పాస్ పుస్తకములు ఇచ్చినారు. నాగుబండి వీరయ్యకు ఇచ్చిన పాస్ బుక్ లో సర్వేనెంబర్ 149 లో ఎన్ఎస్పి కి భూసేకరణ ద్వారా1959 లో సేకరించి పట్టేదారు నాగుబండి పద్మయకు అవార్డు ద్వారా ప్రభుత్వం డబ్బులు చెల్లించిన 3 ఎకరాల 6 గుంటలు మరియు ఆబాది భూములు ఉన్నాయి. నాగబండి వెంకట నరసయ్య కు ఇచ్చిన పాస్ బుక్ లో సర్వేనెంబర్ 149 లో నాగబండి పద్మయ్య ప్రభుత్వ హాస్పటల్ కు దాన పత్రం ద్వారా ఇచ్చిన 2 ఎకనముల భూమి మరియు ఆబాది భూములు ఉన్నాయి.
నాగుబండి వెంకట నరసయ్య కుమారుడు ప్రభుత్వ ఉద్యోగి నాగబండి వెంకట రామారావు ప్రభుత్వ హాస్పిటల్ కు తూర్పున ఉన్న 30 అడుగుల రోడ్డును ఆక్రమించి ఫెన్సింగ్ వేసి సూర్యాపేట సబ్ కొట్టుకు వెళ్లి ఇంజక్షన్ ఆర్డర్ పొందినాడు. అట్టి కేసులో హాస్పిటల్ అధికారులను పార్టీగా చేయలేదు. అదే సర్వే నంబర్లు లో వాళ్ల తండ్రి దగ్గర ప్లాట్స్ కొన్న వారిని,గ్రామపంచాయతీని పార్టీగా చేసినాడు. సూర్యాపేట సబ్ కోర్టులో నడిచిన OS No:57/1991 లో గ్రామపంచాయతీ వేసిన కౌంటర్ లో 1964 డైరెక్ట్ ఆఫ్ టౌన్ ప్లానింగ్ వారు హాస్పిటల్ నిర్మాణం కొరకు ఇచ్చిన లేఅవుట్ చూపించి నారు. న్యాయమూర్తి లేఔట్ పరిగణలోకి తీసుకొని ప్రభుత్వ ఉద్యోగి అయిన నాగుబండి వెంకట రామారావును మందలిస్తూ ఫైన్ వేసి ఇచ్చిన తీర్పులో అది గ్రామ పంచాయతీ రోడ్డు అని చెప్పినారు. కేసు పెండింగ్ లో ఉండగానే 199 లోఅట్టి స్థలాన్ని ప్లాట్లుగా చేసి NV రామారావు అమ్ముకున్నాడు.
నాగుబండి వెంకట రామారావు తండ్రి వెంకట్ నరసయ్య ప్రభుత్వ ఉద్యోగి రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో రిప్ పిటిషన్ నెంబర్ 18416/2002 లో కోదాడ ప్రభుత్వం హాస్పిటల్ వైద్యాధికారి తన 23 గుంటల భూమిని ఆక్రమించాడని ప్రమాణ పత్రం లో పేర్కొన్నారు. హైకోర్టు తీర్పు ఇస్తూ ప్రభుత్వ హాస్పటల్ కు ఉండవలసిన భూమికంటే ఎక్కువ ఉంటే NV రామారావుకు ఇవ్వవలసిందిగా జిల్లా కలెక్టర్ కు చెప్పగా జిల్లా కలెక్టర్ జిల్లా సర్వేయర్ ను సర్వే చేసి రిపోర్టు ఇవ్వమనగా హాస్పిటల్ కాంపౌండ్ లోపల ఒక ఎకరం 30 గుంటలు, తూర్పు, పడమర, దక్షిణం రోడ్లతో సహా కొలిచి హాస్పటల్ కు ఉండ వలసిన రెండు ఎకరముల కంటే 530 చదరపు గజములు ఎక్కువగా ఉన్నదని నివేదిక కలెక్టర్ గారికి ఇవ్వగా దానిని అనుసరించి ఎక్కువగా ఉన్న 530 చదరపు గజములు నాగుబండి వెంకట రామారావు కు ఇవ్వవలసినదిగా ఉత్తర్వులు జారీ చేసినారు. రెవిన్యూ అధికారులు రకరకాల విన్యాసాలు చేసి హాస్పిటల్ కాంపౌండ్ లోపల 530 చదరపు గజములు సర్వేయర్ ఇచ్చిన నక్షాలోని తూర్పు రోడ్డు30 అడుగులు వదిలి, దక్షిణం రోడ్డు 12 అడుగులు వదిలి పంచ నామాలు చేసి ఇవ్వగా అఖిలపక్ష నాయకులు, స్వచ్ఛంద సంస్థల వారు, డి సి హెచ్ ఎస్ నల్లగొండ,వైద్య విధానపరిషత్ కమిషనర్ హైదరాబాద్ గారు జిల్లా కలెక్టర్ గారికి హాస్పటల్ వారి ఆధీనంలో ఒక ఎకరం 30 గుంటల మాత్రమే ఉన్నదని మూడు పక్కల రోడ్లను కొలిచి ఎక్కువగా చూపించినారని జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుని వెళ్ళగా, హాస్పిటల్ కాంపౌండ్ లోపల ఎంత ఉన్నదో సర్వే చేసి చెప్పమని జిల్లా సర్వేయర్ ను ఆదేశించగా కోదాడ ప్రభుత్వ హాస్పటల్ కాంపౌండ్ లోపల ఒక ఎకరం 30 గుంటలు మాత్రమే ఉన్నదని నివేదిక ఇవ్వగా లోగా ఇచ్చిన ప్రొసీడింగ్ రద్దు చేస్తూ మరియొక ప్రొసీడింగ్ ఇచ్చినారు. నాగబండి వెంకట రామారావు మరల హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేస్తూ తాను లేకుండా కొలతలు కొలిచినారని వేసినాడు. ఇలా అనేక రకాలుగా ఉన్నత న్యాయస్థానంలో అనేక రిట్ పిటిషన్ లు వేసిన గాని ఒక్కదానిలో కూడా ప్రభుత్వ హాస్పటల్ కు తూర్పున ఉన్న రోడ్డుపై సూర్యపేట సబ్ కోర్టులో వేసిన కేసు గురించి ప్రస్తావించలేదు.2012 లో జిల్లా కలెక్టర్ కోదాడ హాస్పిటల్ భూమిని సర్వే చేయమని ఆదేశించగా మరల మూడు పక్కల రోడ్లు కొలిచి రెండు ఎకరముల కంటే 565 చదరపు గజములు ఎక్కువగా ఉన్నదని జిల్లా సర్వేయర్ రిపోర్టు చేయగా కలెక్టర్ గారు 500 గజములు నాగు బండి వెంకట రామారావు కు ఇవ్వమని ప్రొసీడింగ్ నంబర్: E2/7254/2003 తేదీ: 05-072012 న ఇవ్వగా ఆర్డిఓ, ఎమ్మార్వోలు పంచ నామాలు చేసి ఇచ్చినట్లుగా కాగితాలపై రాసుకున్నారు. లోగా ఆక్రమించుకున్న 530 గజాలు ఈరోజుకి నాగు బండి వెంకట రామారావు ఆధీనంలోనే ఉండగా కిరాయికు ఇచ్చుట, అమ్మకొనుట జరిగినది.
ప్రభుత్వ హాస్పిటల్ జిల్లా, రాష్ట్ర అధికారుల దృష్టికి, హైకోర్టులో హాస్పటల్ తరఫున రిప్రజెంటేషన్ చేయు న్యాయవాదులు దృష్టికి, రెవెన్యూ అధికారుల దృష్టికి మేము తీసుకుని వెళ్లిన ఒక్కరు కూడా ఉన్నత న్యాయస్థానం దృష్టికి సూర్యపేట సబ్ కోర్ట్ తీర్పుని తీసుకుని వెళ్ళలేదు.
ఇప్పుడు 30 పడకల హాస్పిటల్ 100 పడకల ఏరియా హాస్పిటల్ గా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తూ 26 కోట్ల రూపాయలు కూడా భవనాలకు, హాస్పటల్ పరికరాలకు కేటాయించగా ముగ్గురుమంత్రివర్యులతో, స్థానిక శాసన సభ్యురాలితో శంకుస్థాపన కూడా జరిగినది. హాస్పిటల్ నిర్మాణ స్థలం ఎంత ఉన్నదో జిల్లా సర్వేయర్ ను సర్వే చేసి రిపోర్టు ఇమ్మని కలెక్టర్ ఆదేశించగా సర్వే చేసిన జిల్లా సర్వేయర్, డి సి హెచ్ ఎస్, ఆర్డిఓ, హాస్పిటల్ సూపర్నెంట్ అందరూ కలిసి కలెక్టర్ గారికి సమర్పించిన రిపోర్టులో ఒక ఎకరం 25 గుంటలు ఉన్నదని తెలిపినారు.2012 లో రెండు ఎకరాల కంటే 565 చదరపు గజములు ఎక్కువ ఉన్నదని నాగుబండి వెంకట రామారావు కు 500 చదరపు గజములు ఇచ్చిన ఈ అధికారులే ఇప్పుడు ఒక ఎకరం 25 గుంటలు ఉన్నదని కలెక్టర్ గారిని తప్పుదారి పట్టించుచున్నారు.
2000 సంవత్సరంలో రాష్ట్ర కమిషనర్ ఆఫ్ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ గారు మరియు జిల్లా సర్వేయర్లు అనేకసార్లు హాస్పిటల్ కాంపౌండ్ లోపల ఒక ఎకరం 30 గుంటలు ఉన్నదని రిపోర్టులు ఇచ్చి నారు. మూడు పక్కల రోడ్లను కలిపి కొలిచి రెండు ఎకరాల 565 చదరపు గజాలు ఉన్నదని చెప్పిన సర్వేయర్ రిపోర్ట్ కరెక్టా? లోగా కలెక్టర్లు ఇచ్చిన ప్రొసీడింగులు అమలులో ఉన్నప్పుడు హాస్పటల్ కు రెండు ఎకరముల 65 చదరపు గజాలు ఉన్నట్లే కదా ?కోదాడ ప్రభుత్వ హాస్పిటల్ సూపర్డెంట్, డి సి హెచ్ ఎస్,వైద్య విధాన పరిషత్ కమిషనర్, హాస్పిటల్ అభివృద్ధి కమిటీ వారు హాస్పటల్ కు ఉన్న రెండు ఎకరముల స్థలాన్నే కాపాడ లేకపోతే, ప్రభుత్వం కేటాయించి 100 పడకల ఏరియా హాస్పిటల్ కు స్థలం ఎలా సరిపోతుందో? తెలియచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది. కాబట్టి రెండు ఎకరములలో వంద పడకల ఏరియా హాస్పిటల్ నిర్మాణం చేయాలని కోదాడ నియోజకవర్గ ప్రజల ఆకాంక్ష నెరవేర్చటానికి జిల్లా కలెక్టర్ గారు తగినంత సమయాన్ని కేటాయించి దిగ్విజయంగా వంద పడకల ఏరియా హాస్పిటల్ 2 ఎకరాలలో నిర్మాణం పూర్తి చేయించగలరు.
కుదరవల్లిమోహనకృష్ణ.
(బసవయ్య)
సెల్:9490128449.