ధర్మ సమాజ్ పార్టీ సంయుక్త ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ర్యాలీ

ధర్మ సమాజ్ పార్టీ వేములపల్లి మండల అధ్యక్షులు ఇంద్రపల్లి శివకుమార్
తెలంగాణ వార్త వేములపల్లి ఏప్రిల్ 19 : SC మాదిగ యువతిని మోసం చేసిన రెడ్డి యువకుడు - పెళ్లి ఆశతో మోసపోయిన యువతి ఆత్మహత్య - మల్లీశ్వరి హత్యకు కారకుడైన కుక్కల జాన్ రెడ్డి పై మర్డర్ కేసు నమోదు చేసి బాధ్యత వహించే వారిని శిక్షించాలి ధర్మ సమాజ్ పార్టీ వేములపల్లి మండల అధ్యక్షులు ఇంద్రపల్లి శివకుమార్ అగ్రకుల ఆధిపత్య దురహాంకారానికి బలైపోయిన దళిత జాతి ముద్దు బిడ్డ ధర్మారపు మల్లీశ్వరి గారికి 18-04-2025 న వేములపల్లి మండల కేంద్రంలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్బంగా మండల అధ్యక్షులు ఇంద్రపల్లి శివకుమార్ గారు మాట్లాడుతూ ఇటీవల 14-04-2025 న నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం బొకవంతలపాడు గ్రామానికి చెందిన ధర్మారపు మల్లీశ్వరి ఓ మాదిగ యువతి(SC) నిర్దోషి, స్వచ్ఛమైన మనసుతో జీవిస్తున్న ఆ యువతిని అదే గ్రామానికి చెందిన ఓ రెడ్డి వర్గానికి చెందిన కుక్కల జాన్ రెడ్డి అనే యువకుడు మాయ మాటలు చెప్పి పెళ్లి చేసుకుంటానని నమ్మించి, వ్యక్తిగతంగా చాలా మానసికంగా దగ్గరగా వచ్చి చివరికి మోసం చేశాడని ఆత్మహత్య చేసుకుంది అని తెలిపారుఆ యువతి అతని ప్రేమను నిజమని నమ్మితన భవిష్యత్తునుఅతనిపైనే ఆధారపడి చూసిందికానీ చివరికి అతను కులాధారిత దృష్టితోతన కుటుంబ సభ్యులతో మరియు బంధువుర్గంతో కలిసి ఆమెను దూశించడంవదిలిపెట్టడం వివక్ష చూపించడం వల్ల యువతి తీవ్ర మానసిక వేదనకు గురై సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందనిఇది కేవలం ఓ ప్రేమలోని మోసం మాత్రమే కాదుఇది కులం ఆధారంగా జరిగిన హత్య మానవ హక్కుల ఉల్లంఘనమాదిగ యువతిని తక్కువచూపే విధంగాదురుసుగా వ్యవరించడమే కాకుండామానసిక వేధింపులకు గురిచేయడం వల్ల ఆమె జీవితం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేసారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ప్రధానకార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జ్ తరి యల్లయ్య, మాట్లాడుతూ మరి ఇంతవరకు ఈ సంఘటనపై స్పందించని స్థానిక ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి, ఎంపీ రఘువీర్ రెడ్డి వీరి తండ్రి జానారెడ్డి వీళ్ళ ముగ్గురికి వారి బంధువర్గమే ముఖ్యం తప్ప 90% BC/SC/ST ప్రజలకు ఏమ్ జరిగిన సంబంధం లేదు అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది అన్నారుతక్షణమే ఎమ్మెల్యే జయవీర్ రెడ్డి స్పందించి బాధితుల కుటుంబానికి వెంటనే న్యాయం చేకూరెలా చర్యలు తీసుకోవాలని తెలియచేసారులేనియెడల 90% BC/SC/ST ప్రజల మెజారిటీ ఓట్లతో గెలిచిన మీరు సామాజిక అన్యాయం వైపు ఉంటే మాత్రం నియోజకవర్గ శాసనసభ్యులు గా కొనసాగే అర్హత మీకు ఏమాత్రం లేదు వెంటనే మీ పదవికి రాజీనామా చేసిమీకు ఉన్న డబ్బు బలంతో మీ వర్గానికి మాత్రమే సేవ చేసుకోండి ఈ ప్రజల దగ్గరికి రావొద్దు అని హెచ్చరించారుబాద్యుదైన కుక్కల జాన్ రెడ్డి పై క్రిమినల్ మర్డర్ కేసు నమోదు చేసి, IPC(ఇండియన్ పీనల్ కోడ్) 306-ఆత్మహత్యకు ప్రేరేపించడం, IPC 417 / 420-మోసం చేయడం మరియు SC మహిళపై చేసిన మానసిక/సామాజిక వేధింపులకు గాను SC/ST(Prevention of Atrocities) Act అట్రాసిటీ చట్టం కింద దర్యాప్తు జరపాలని డిమాండ్ చేసారు బాధితులకు న్యాయం జరిగేంత వరకు వారికి అండదండగ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీధర్మ సమాజ్ పార్టీ మరియు మద్దతు ఇచ్చే సామాజిక సంఘాలు తోడుగా ఉంటాయి అని తెలియచేసారుఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ జిల్లా నాయకులు పురాణపు సతీష్, రెమడాలా వెంకటేష్, మండల నాయకులు వల్లపుదాసు సందీప్, గంగారపు ప్రేమ్, ఇంద్రపల్లి వినయ్, మాతంగి నితిన్, ఇంద్రపల్లి కిరణ్ మరియు ఎస్సీ ఎస్టీ బీసీ నాయకులు M.కిరణ్, P.సతీష్, P.ఇస్సాకు, A.సైదులు, I.నాగయ్య, V.సైది ఇతర సంఘాలనాయకులు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.