బిఆర్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డుకు దారాసింగ్ ఎంపిక

18-04-2025 తెలంగాణ వార్త ప్రతినిధి చిన్నంబావి మండలం.
చిన్నంబావి మండల పరిసర ప్రాంతమైన బెఖ్యం గ్రామానికి చెందిన యువ నాయకుడు, గ్రామాలలో ప్రజలకు మమేకమై ఎన్నో గ్రామాల ప్రజలకు సేవలు అందించిన దారాసింగ్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డు కు ఎంపిక కావడం జరిగినది. వివిధ రంగాలలో సేవలందించిన మరియు గ్రామీణ ప్రాంతాలలో సేవలందించిన వారికి అవార్డులు ప్రధానం చేశారు. శ్రీశైలం నిర్వాసితుల సమస్య 45 సంవత్సరాలది నిర్వాసితుల గ్రామమైన బెక్యం వాస్తవడు ధారాసింగ్ ఈ సమస్యపై అలుపెరుగని పోరాటం చేస్తూ కేంద్ర మినిస్టర్లను, కలవడం మరియు ఇక్కడ రాజకీయ నాయకులను, ప్రభుత్వ పెద్దలను హైకోర్టులో సమస్య మీద కోర్టుకు వెళ్లడం 67 గ్రామాలకు న్యాయం చేయాలని అందరికీ ఉద్యోగ అవకాశాలు మరియు గ్రామ సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నందున డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డు 17-4-2025 ప్రభుత్వ ప్రణాళిక ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లల చిన్నారెడ్డి చేతుల మీదుగా మరియు పెద్దపెద్ద ప్రముఖుల చేతల మీదుగా దారాసింగ్ అవార్డు అందుకోవడం జరిగినది.
దారాసింగ్ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఎక్సలెంట్ అవార్డును అందుకున్నందుకు 67 గ్రామాల శ్రీశైలం నిర్వహితులు, గ్రామాలలోని ప్రజలు ధారాసింగ్ గారిని అభినందించారు. శ్రీశైలం నిర్వహితులు మాట్లాడుతూ ధారాసింగ్ అన్న నీవు ఇదే విధంగా అవార్డులు, రివార్డులు అందుకుంటూ ప్రభుత్వంలో పెద్ద గుర్తింపు పొందుతూ మాలాంటి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు నీవు అండగా నిలబడాలని నీ నుండి మా శ్రీశైలం నిర్వహితుల కుటుంబాలు బాగుపడుతున్నాయని ఆశిస్తున్నాం. అని అభినందించారు.