ద్రమత్తులో ఉన్న జోగులాంబ గద్వాల జిల్లా విద్యాశాఖ అధికారులు

జోగులాంబ గద్వాల 20 జూన్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : గద్వాల జిల్లాలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూల్ చేస్తూ, పాఠ్యపుస్తకాలు ఎక్కువ ధరలకు అమ్ముతూ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యాలు పేద విద్యార్దులను దోపిడీ చేస్తున్నాయి. నిన్న జరిగిన శ్రీ చైతన్య పాఠశాలలో రూ. 5,000 నుంచి 10,000 వరకు పాఠ్యపుస్తకాలను యాజమాన్యాలు విద్యార్థులకు విక్రయిస్తున్న ఇట్టి విషయము ఆధారాలతో జిల్లా విద్యాశాఖ అధికారుల దృష్టికి వచ్చిన ఆ పాఠశాలపై ఎటువంటి చర్యలు తీసుకోకపోగా ఆ పాఠశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతూ తూ.. తూ మంత్రంగా విచారణ చేసి పాఠశాల యాజమాన్యానికి సహకరించి పాఠశాల పై ఎటువంటి పనిష్మెంట్ ఇవ్వకుండా సహకరిస్తున్నారు. శ్రీ చైతన్య పాఠశాల పై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆలోచించాల్సిన విషయమే. ఇప్పటికైనా నిద్ర మత్తులో ఉన్న విద్యాశాఖ అధికారులు మత్తును వీడి శ్రీ చైతన్య పాఠశాలపై తగు చర్యలు తీసుకొని విద్యార్థుల తల్లిదండ్రులకు సహకరించాలని, అలాగే గద్వాలలో ప్రైవేట్ పాఠశాలలు దాదాపుగా 99% పాఠశాలలో ఇదేవిధంగా జరుగుతుందని అన్ని పాఠశాలలను తనిఖీ చేసి చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.