ఎండిపోయిన పంట పొలాలకు నష్టపరిహారం చెల్లించాలి
మునగాల 09 మార్చి 2024
తెలంగాణ వార్తా ప్రతినిధి :-
- మునగాల మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని ఎండిపోయిన పంటలకు ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలని మేదరమెట్ల వెంకటేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
శనివారం మండలంలోని సుందరయ్య స్మారక భవనం నందు షేక్ సైదా అధ్యక్షతన జరిగిన సిపిఎం పార్టీ మండల కమిటీ సమావేశంలో పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదర మెట్ల వెంకటేశ్వరరావు మాట్లాడుతూ మండలంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల వలన నీరు లేక పోవడంతో నాగార్జునసాగర్ ఎస్ ఆర్ ఎస్ పి కాలవలో నీళ్లు విడుదల చేయకపోవడంతో పంట పొలాలు పూర్తిగా ఎండి పోతున్నాయి ఎండిపోయిన పొలాలకు ఎకరానికి రూ 20000/- లు నష్టపరిహారం ఇచ్చి మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని.
అట్లాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహ జ్యోతి ప్రజా పాలనలో ఉచిత విద్యుత్ కోసం దరఖాస్తులు వారికి సబ్సిడీ వర్తించేలాగా మండలానికి వచ్చి ఎండిఓ ఆఫీస్ లో దరఖాస్తులు పెట్టుకోవడానికి వచ్చిన వారు ఇబ్బంది పడుతున్నారు కనుక గ్రామాలలో పంచాయతీ కార్యదర్శుల ద్వారా దరఖాస్తులు వెంటనే స్వీకరించే విధంగా ఏర్పాటు చేయాలని కోరినారు
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చoదా చంద్రయ్య బచ్చలకూర స్వరాజ్యం వీరబోయిన వెంకన్న స్టాలిన్ రెడ్డి, జ్యోతి,వెంకటాద్రి, బొల్లా కృష్ణారెడ్డి, మంగయ్య, రామకృష్ణారెడ్డి, అనంతు గురవయ్య, తదితరులు పాల్గొన్నారు