దేశ ఆత్మగౌరవానికి ప్రతీక జాతీయ జెండా

Jul 5, 2025 - 20:06
 0  1
దేశ ఆత్మగౌరవానికి ప్రతీక జాతీయ జెండా
దేశ ఆత్మగౌరవానికి ప్రతీక జాతీయ జెండా

 ఘనంగా జాతీయ పతాక సృష్టికర్త పింగళి వెంకయ్య  వర్ధంతి  వేడుకలు  

* తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షులు  పంతంగి వీరస్వామి గౌడ్ 

 (సూర్యాపేట టౌన్, జులై 4)  : భారతదేశ ఆత్మగౌరవానికి ప్రతీక జాతీయ జెండా అని తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు  పంతంగి వీరస్వామి గౌడ్  అన్నారు.  శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద జాతీయ జెండా సృష్టికర్త పింగళి వెంకయ్య వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి మాట్లాడారు. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన స్వాతంత్ర ఉద్యమ కాలంలో మహాత్మా గాంధీ సూచన మేరకు త్రివర్ణాపతాకాన్ని రూపొందించిన గొప్ప స్వతంత్ర సమరయోధుడు పింగళి వెంకయ్య అని కొనియాడారు. జాతీయ జెండా స్ఫూర్తితో ఆనాడు దేశ ప్రజలు బ్రిటిష్ పాలకులను తరిమికొట్టారని చెప్పారు. ఆనాడు జాతీయ పతాకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య దేశం ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని గుర్తు చేశారు. వ్యవసాయ, ఖనిజ శాస్త్రవేత్త అయిన పింగళి వెంకయ్య మిలటరీ లో కూడా పనిచేసినట్లు చెప్పారు. దేశం గర్వించే విధంగా జాతీయ జెండాను రూపకల్పన చేసిన పింగళి వెంకయ్య విగ్రహాన్ని ప్రభుత్వం హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడం గొప్ప విషయమని కొనియాడారు. దేశ ప్రజలందరూ గౌరవించే జాతీయ పథకాన్ని రూపొందించిన పింగళి వెంకయ్య తెలుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి కావడం గర్వించదగ్గ విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జలగం సత్యం గౌడ్, జిల్లా గౌరవ సలహాదారులు దేవత కిషన్ నాయక్, జిల్లా ప్రధాన కార్యదర్శి వెన్న శ్రీనివాస్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు కోడి లింగయ్య, జిల్లా కోశాధికారి పాల సైదులు, పట్టణ కార్యదర్శి భానోత్ జానీ నాయక్, పట్టణ గౌరవ సలహాదారుడు మాదిరెడ్డి గోపాల్ రెడ్డి  ఖమ్మం పాటి అంజయ్య గౌడ్, అయితే గాని మల్లయ్య గౌడ్, ఆకుల మారయ్య గౌడ్, రాపర్తి జానయ్య, కాంతారావు , పట్టేటి కిరణ్, పెగ్గేపురం నరసయ్య, సారగండ్ల కోటేష్,   తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333