ఓటర్ లిస్ట్ సవరణ ఇంటింటి సర్వేను త్వరగా పూర్తి చేయాలి.
నాగారం ఆగస్టు 31 తెలంగాణ వార్త:- ఓటర్ లిస్ట్ సవరణ ఇంటింటి సర్వే ను త్వరగా పూర్తి చేయాలని సూర్యాపేట జిల్లా ఆర్డిఓ ఆర్. వేణు మాధవరావు అన్నారు. శనివారం నాగారం మండల కేంద్రంలోని తహసిల్దార్ మరియు ఎంపీడీవో కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఓటర్ లిస్ట్ సవరణలో భాగంగా బిఎల్వోలు చేస్తున్న సర్వే ను పరిశీలించారు. ఓటర్ లిస్ట్ సవరణ పారదర్శకంగా ఉండాలని అన్నారు. ఆయన వెంట తహసిల్దార్ బ్రహ్మయ్య ఎంపీడీవో శ్రీనివాస్ ఎంపీవో మారయ్య జానీ మియా పంచాయతీ సెక్రటరీలు చంద్రశేఖర్ వెంకటేష్ తదితరులు ఉన్నారు.