దసరా పండుగకు ఇల్లు విడిచి పోతే జాగ్రత్తలు పాటించాలి!ఎస్సై వెంకటరెడ్డి

అడ్డగూడూరు 25 సెప్టెంబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– దసరా పండుగ సందర్భంగా చుట్టాల మార్గం ఇతర ఊర్లకు వెళ్తున్న ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఎస్సై వెంకటరెడ్డి అన్నారు.ఇళ్లలో బంగారు,వెండి ఆభరణాలు, విలువైన వస్తువులు,డబ్బులు భద్రపరచకుండ వదిలేయవద్దని ఆయన హెచ్చరించారు.బ్యాంకుల్లో భద్ర పరచుకొని,ఇళ్లకు తాళాలు వేసి తాళం చెవి చుట్టుపక్కల ఎక్కడ పెట్టకుండా వెంట తీసుకుని వెళ్లాలని,చుట్టుపక్కల వారికి,పోలీస్ వారికి సమాచారం ఇవ్వాలని సూచించారు.ఇలాంటి సమయంలోనే దొంగతనాలకు పాల్పడే వ్యక్తులు అవకాశంగా భావిస్తారు కాబట్టి ప్రజలు తప్పనిసరిగా పోలీసువారి సూచనలు పాటించాలని అన్నారు. అదేవిధంగా బతుకమ్మ, దసరా పండుగని ప్రజలంతా భక్తి శ్రద్ధతో జరుపుకోవాలని ఎలాంటి ఆవాంఛనీయ సంఘటనలు జరగకుండా విధిగా ప్రతి ఒక్కరు బాధ్యతగా ఉండాలని కోరారు.అత్యవసరమైన పరిస్థితులలో డయల్ 100కు ఫోన్ చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.