తెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం

Sep 14, 2024 - 18:12
Sep 14, 2024 - 18:47
 0  29
తెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం

తెలంగాణ పోరాట వారసత్వాన్ని కొనసాగిద్దాం

ఎర్ర జెండా పేదలకు అండ

సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు.

తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం పేదల కోసం పేద ప్రజల కోసం జరిగిందని,ఉద్యమం ఒక దిక్సూచిగా వెలుగొనిందని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మెదరమెట్ల వెంకటేశ్వరరావు సిపిఎం పట్టణ కార్యదర్శి ఎం ముత్యాలుఅన్నారు

స్థానిక కోదాడ పట్టణం సిపిఎం కార్యాలయంలో సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట వారోత్సవాల సందర్భంగా సిపిఎం జెండా ఆవిష్కరణ సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ జెండా ఆవిష్కరణ చేసి అనంతరం అమరవీరుల ఫోటోలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది 

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాయుధ రైతాంగపోరాటం భూమికోసం భుక్తి కోసం పేద ప్రజల విముక్తి కోసం దున్నేవాడికే భూమి కావాలని బాంచన్ దొర నీ కాళ్లు మొక్కుతా అన్న ధరోని బంధువుకు పట్టించిన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానికి దక్కిందని వారు అన్నారు. నైజాం నవాబుని గద్దె దింపే వరకు పోరాడి పేద ప్రజలకు విముక్తి కలిగించిందని వారన్నారు. భూస్వామ్య పెట్టుబడిదారుల గడిలు పగలగొట్టి సాయుధ పోరాట బలగాలు వారి భూములను ఆక్రమించుకొని ఆ భూమిలో పండిన పంటలను పేదవారికి పంచిపెట్టేవారని వారన్నారు. దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ మల్లు స్వరాజ్యం లాంటి ఎంతోమంది తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొని అమరులైన వారి వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ముందుకు పోయేందుకు యువ నాయకత్వం ముందుకు రావాలని వారు అన్నారు. నాటినుండి నేటి వరకు కమ్యూనిస్టు పార్టీ ఎర్రజెండా పేదల కోసం పేద ప్రజల కోసం పనిచేస్తుందని తెలంగాణ సాయుధ పోరాటం ఎర్రజెండా పేదలకు అండగా ఉంటుందని, పోరాడే వారిదే ఎర్రజెండా అని ఎర్ర జెండాకు ఎదురులేదని భవిష్యత్ తరాలకు ఎర్రజెండే అండగా ఉంటుందని వారన్నారు ఈ యొక్క కార్యక్రమంలో సిపిఎం సీనియర్ నాయకులు డాక్టర్ సూర్యనారాయణ డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జట్టుకొండ బసవయ్య అనంతగిరి మండల కార్యదర్శి రాపోలు సూర్యనారాయణ పార్టీ టౌన్ కమిటీ సభ్యులు కుక్క డప్పునలిని దాసరి శ్రీనివాస్ కర్ణకోటి నవీన్ శాఖ కార్యదర్శి సిహెచ్ భీమయ్య గంట నాగరాజు జి మరియన్న భూచక్రం పాపా చారి ప్రభాకర్ రమేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

RAVELLA RAVELLA RC Incharge Kodada Telangana State