తుంగతుర్తి నుండి హైవే హైదరాబాద్ బస్సు సౌకర్యం

ఆర్వపల్లి 21 జనవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట డిపో ఆర్టీసీఎస్పి రేస్ బస్సు సౌకర్యం నకిరేకల్ తుంగతుర్తి హైవే మీదగా తుంగతుర్తిలో ఉదయం 9 గంటలకు బయలుదేరి అర్వపల్లి చివరస్త 9:30 కు చేరుకొని ఇక్కడి నుండి బయలుదేరి జాజిరెడ్డిగూడెం 9:40 నిమిషాలకు చేరుకొని అక్కడ నుండి మాదారం మరియు నకిరేకల్ హైవే మీదగా హైదరాబాద్ మహానగరం దిల్సుఖ్ నగర్ 12:30 నిమిషాలకు చేరుకుంటుంది.తిరిగి దిల్సుఖ్నగర్ బస్టాండ్ నుండి ఒకటి గంటలకు మొదలై నకిరేకల్ మీదగా మళ్లీ వంగమర్తి మాదారం మీదగా అర్వపల్లికి సాయంత్రం నాలుగు గంటల సమయంలో చేరుకుంటుంది.ఇక్కడ నుండి తుంగతుర్తి వెళ్లి సూర్యాపేట చేరుకుంటుంది.ప్రజలందరూ కచ్చితంగా ఈ బస్సు టైమును ఫాలోవై ప్రజలందరూ కూడా సహకరిస్తే మనకు సులభమైన మార్గంలో సూర్యాపేటకు పోకుండానే మన అర్వపల్లి గ్రామం నుండే హైదరాబాదు మహానగరానికి చేరుకోవచ్చు ప్రజలందరూ కచ్చితంగా ఈ టైమింగ్స్ ను ఫాలోవై సహకరిస్తారని హైవేకి ఇరువైపులా ఉన్న గ్రామాల ప్రజలు బస్సు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని తెలపడం జరుగుతుందని అన్నారు.