తీన్మార్ మల్లన్నకు ఘనంగా సన్మానం

Jun 23, 2024 - 19:48
 0  8
తీన్మార్ మల్లన్నకు ఘనంగా సన్మానం

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తీన్మార్ మల్లన్నకు ఘనంగా సన్మానం. ఆత్మకూర్ ఎస్. ఖమ్మం వరంగల్ నల్లగొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఆదివారం మండల పరిధిలోని నెమ్మికల్ లో జిల్లా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి కృషి చేస్తుందని అన్నారు మున్నూరు కాపులు ఏ పార్టీలో ఉన్న నమ్మకంగా పనిచేస్తారని అన్నారు. తన గెలుపునకు మాజీమంత్రి రామిరెడ్డి దామోదర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని ఆయన తనయుడు సర్వోత్తమ్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో చట్ట సభలకు తీసుకుపోవడానికి అన్నారు. ఈ సందర్భంగా టి పి సి సి ఉపాధ్యక్షులు,మాజీ మంత్రి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపులు కాంగ్రెస్ పార్టీతోనే ఎక్కువగా కలిసి ఉండాలని వారి అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మున్నూరు కాపులలో పేదవారిని గుర్తించి వారి అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తామని అన్నారు తీన్మార్ మల్లన్నకు పట్టభద్రులు పెద్ద ఎత్తున పట్టం కట్టారని 34 నియోజకవర్గాలకు తీన్మార్ మల్లన్న ప్రాతినిధ్యం వహిస్తున్నాడని అన్ని నియోజకవర్గాలలో అందరిని సమన్వయపరచుకొని ముందుకు వెళ్లాలని ఆయన కోరారు ఈ సందర్భంగా మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో గజమాలతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షులు చెవిటి వెంకన్న ఏఐసీసీ నాయకులు రామ్ రెడ్డి సర్వోత్తమ్ రెడ్డి కొప్పుల వేనారెడ్డి మున్నూరు కాపు సంఘం మహాసభ జిల్లా అధ్యక్షులు ఎలిమినేటి రమేష్, రామసాని శ్రీనివాస్ ఎలిమినేటి అభినయ్ మానేపల్లి లక్ష్మయ్య, రమసాని రమేష్ డేగల కృష్ణ డేగల రమేష్ పట్టల వెంకటేశ్వర్లు శ్రవణ్ బీరవెల్ రవీందర్ రెడ్డి, మిరియాల కృష్ణమూర్తి, దిలీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు