తిరుమలగిరి మున్సిపాలిటీని కైవసం చేసుకున్న కాంగ్రెస్ పార్టీ
తిరుమలగిరి మున్సిపల్ చైర్పర్సన్ గా శాగంటి అనసూయ రాములు, వైస్ ఛైర్మన్ గా కేసిడి సరళ ఎన్నిక....
సూర్యాపేట ఆర్డీవో మధుసూదనరావు సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ ల ఏకగ్రీవంగా ఎన్నిక...
15 మంది కౌన్సిలర్లకు గాను 12 మంది కౌన్సిలర్లు, ఎక్స్ అఫీషియల్ సభ్యుడిగా ఎమ్మెల్యే మందుల సామేలు హాజరు...
మున్సిపల్ కార్యాలయం వద్ద ఎలాంటి సంఘటనలు జరగకుండా పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు...
బాణా సంచాలు కాల్చి సంబురాలు జరుపుకున్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు...
తిరుమలగిరి 07 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్ :- తిరుమలగిరి మున్సిపల్ కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో శనివారం సూర్యాపేట ఆర్డీవో వేణుమాధవ్ సమక్షంలో మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ లను ఎన్నుకున్నారు. ఈ మేరకు 8వ వార్డు కౌన్సిలర్ శాగంటి అనసూయ రాములు, 7వ వార్డు కౌన్సిలర్ సరళలను వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ఆర్డీవో వేణుమాధవ్ తెలిపారు. ఈ మేరకు కార్యాలయం వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
తిరుమలగిరి మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నికకు సహకరించిన కౌన్సిలర్లకు అధికారులకు తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ కృతజ్ఞతలు తెలిపారు కాంగ్రెస్ పార్టీ పాలనలో తిరుమలగిరి మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని ఆయన అన్నారు నూతన పాలకవర్గ హాయంలో మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని ఆయన కోరారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎవరు కూడా అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలని అన్నారు అనంతరం మున్సిపల్ కార్యాలయం నుండి తెలంగాణ చౌరస్తా వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు అనంతరం కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తలు శాలువాలతో సన్మానించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు పార్టీ కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు