మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎన్కౌంటర్ పై న్యాయవిచరణ జరగాలి
అని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల డిమాండ్ చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. మావోయిస్టు అగ్రనేత , మావోయిస్టు పార్టీ జనరల్ సెక్రెటరీ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు అలియాస్ గంగన్న ఎన్కౌంటర్ పై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి గత నాలుగు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో తనదైన శైలిగా చురుగ్గా బెటాలియన్ ని నడుపుతూ మెరుపు దాడులకు వకర్తగా ఉన్న బసవరాజ్ గణపతి రాజీనామా తర్వాత మావోయిస్టు పార్టీ పూర్తి బాధ్యతలు తీసుకోవడం జరిగింది. అట్లాంటి ఒక సీనియర్ సుప్రీం లీడర్ ఇటువంటి ఒక చిన్న ఎన్కౌంటర్లో చనిపోవడం అనేది అనుమాన అస్పద విషయంగా భావించి తక్షణమే సుప్రీంకోర్టు ఈ ఎన్కౌంటర్ పై న్యాయ విచారణ జరిపించాలని ఒక కమిటీని ఏర్పాటు చేసి చతిస్గడ్ లో జరుగుతున్న అన్ని ఎన్కౌంటర్లపై న్యాయవిచారణ జరగాలని యువతరం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఏకపక్షంగా జరుగుతున్న కాల్పులు, ఎట్లాంటి యుద్దమైన సరే ఇరుపక్షాల్లో నష్టం జరిగే ద్రోని కనపడుతుంది కానీ ఇక్కడ ఏకపక్షంగా కాల్పులు కేంద్ర బలగాలు 2000 నుంచి 10000 మంది కేవలం 20, 30, 10, 15 మంది మీద దాడులు చేయడం అనేది సరైన పద్ధతి కాదని, ఇప్పటికే ఎన్నో మార్లు మావోయిస్టు పార్టీ నుంచి శాంతి చర్చలకు లేఖలు విడుదల చేయడం జరిగింది. మరియు పార్టీ సభ్యుడు రూపేష్ ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలపడం జరిగింది, శాంతి చర్చలకు సుముఖంగా ఉన్న మావోయిస్టు పార్టీ. శాంతి మాకు అవసరం లేదు అనే ద్రోనీలో కేంద్రం వ్యవహరిస్తూ దాడుల మీద దాడులు చేస్తూ దేశంలో ఒక యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారు, రాబోయే తరాలకు కూడా ఒక యుద్ధ ప్రాతిపద్యాన్ని, నేర్పించుకుంటూ శాంతి అనే మాటకి తోవు లేకుండా చేస్తుంది కేంద్ర ప్రభుత్వం కావున, ఈ ద్రోనిని సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఈ దాడులను ఆపి ఈ మరణాలను తగ్గించి, శాంతియుత వాతావరణంగా తీర్చిదిద్దాలని, కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశించాలని యువతరం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి గుజ్జుల డిమాండ్ చేశారు.