తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు

Apr 4, 2026 - 18:46
Apr 4, 2026 - 20:35
 0  2
తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు

తెలంగాణ వార్త ఆత్మకూరు ఎస్ తల్లి జ్ఞాపకార్థంగా చలివేంద్రం ఏర్పాటు అభినందనీయం ఆత్మకూర్ (ఎస్): ప్రజల సౌకర్యార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని మండల తహసిల్దార్ అమిన్ సింగ్ అన్నారు. శనివారం మండల కేంద్రం లో మేడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో మేడి నరసమ్మ జ్ఞాపకార్థం మండల పరిషత్ కార్యాలయం వద్ద ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎండాకాలంలో ప్రజలు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారికి దహార్తిని తీర్చేందుకు తన తల్లి జ్ఞాపకార్థం చలివేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో మేడి ఫౌండేషన్ చైర్మన్ మేడి కృష్ణ, ఎంపీడీవో హసీం, ఎస్సై శ్రీకాంత్ గౌడ్, రాష్ట్ర ఉత్తమ జర్నలిస్టు అవార్డు గ్రహీత భూపతి రాములు, ఏపీవో రాము జంగం జానయ్య , మేడి ముత్తయ్య,మేడి లింగయ్య, మేడి నాగయ్య, పద్మ, సునీత, అలివేల, ములకలపల్లి వెంకన్న, బచ్చలకూరి నవీన్, రమేష్, మొలకలపల్లి విష్ణు, చరణ్ తదితరులు ఉన్నారు.